Peddi Day 1 Collection | రామ్చరణ్ పెద్ది ఫస్ట్ డే కలెక్షన్స్ – దేవర , పుష్ప 2 కంటే తక్కువే
రామ్‌చరణ్ పెద్ది మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 135 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. రామ్‌చరణ్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా చరిత్రను సృష్టించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Jun 5, 2026, 3.00 pm IST
Peddi Day 1 Collection | రామ్చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్‌చరణ్ కెరీర్‌లో తొలి రోజు హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. పెద్ది మూవీ ఫస్ట్ డే 135. 36 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాక్సాఫీస్ ఛాంపియన్ పేరుతో పోస్టర్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
బ్రేక్ ఈవెన్ టార్గెట్....
ఆంధ్రా, నైజాంలో కలిపి గురువారం 71.85 కోట్ల వరకు పెద్దికి కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఓవర్‌సీస్‌లో ఈ మూవీ వసూళ్లను సొంతం చేసుకుంది. 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన రామ్చరణ్ మూవీ మొదటి రోజు దాదాపు 34 శాతం వరకు రికవరీ సాధించినట్లు సమాచారం. మెగా హీరో మూవీ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకా 145 కోట్లకుపైనే కలెక్షన్స్ రావాల్సిఉందట.
సోలో హీరోగా...
సోలో హీరోగా ఫస్ట్ డే రామ్‌చరణ్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా పెద్ది రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా ఆర్ఆర్ఆర్ తర్వాత సెకండ్ మూవీ ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అత్యధిక షేర్ వసూళ్లను దక్కించుకున్న సినిమాల్లో ఐదో ప్లేస్‌లో పెద్ది నిలిచింది. ఈ లిస్ట్‌లో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో నిలవగా...పుష్ప 2, ఓజీ, దేవర ఆ తర్వాత ప్లేస్‌లో ఉన్నాయి. రెండో రోజు కూడా పెద్ది వంద కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
క్రాస్ ఓవర్ అథ్లెట్...
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కించారు. తన ఊరి కష్టాలను తీర్చడం కోసం ఓ క్రీడాకారుడు సాగించిన పోరాటంతో పెద్ది సినిమా రూపొందింది. ఈ సినిమాలో క్రాస్ ఓవర్ అథ్లెట్ పాత్రలో అసమాన నటనతో రామ్‌చరణ్ ఆకట్టుకున్నాడు. రెజ్లర్, క్రికెటర్, అథ్లెట్‌గా మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన పాత్రల్లో అతడి ట్రాన్స్‌ఫర్మేషన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. యాక్షన్ అంశాలు, వయలెన్స్ లేకుండా ప్యూర్ డ్రామా మూవీగా బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించారు. పెద్దిలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vinod Kumar, Dayakar Rao | గద్దెను కూల్చినంత ఈజీగా.. ప్రజల మనసుల నుంచి పెద్దిని తీసేయలేరు
ఆగస్టు 10, 2026

Peddi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి పెద్ది – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
జులై 4, 2026

Janhvi Kapoor | ఓటీటీలోకి జాన్వీ కపూర్ ఎంట్రీ – డెబ్యూ వెబ్‌సిరీస్‌లో కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ – హీరోల కంటే ఎక్కువే
జూన్ 25, 2026
తాజావార్తలు
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్



