త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajender | రోడ్డు పక్కన వాహనాలను నిలపకండి.. ప్రాణాలు తీయకండి: ఎంపీ ఈటల రాజేందర్

Etala Rajender | రోడ్డు ప‌క్క‌న వాహ‌నాలు నిలిపి (Road Side Parking) మ‌రొక‌రి ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మ‌వ్వొద్ద‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Etala Rajender) సూచించారు. అతివేగం, నిర్లక్షం, నిద్రమత్తు కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి, రోడ్డున పడేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On May 2, 2026, 12.19 pm IST

Etala Rajender | రోడ్డు పక్కన వాహనాలను నిలపకండి.. ప్రాణాలు తీయకండి: ఎంపీ ఈటల రాజేందర్
Advertisement

Etala Rajender | త్రినేత్ర‌.న్యూస్‌: రోడ్డు ప‌క్క‌న వాహ‌నాలు నిలిపి (Road Side Parking) మ‌రొక‌రి ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మ‌వ్వొద్ద‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Etala Rajender) సూచించారు. అతివేగం, నిర్లక్షం, నిద్రమత్తు కారణం ఏదైనా రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి, రోడ్డున పడేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వేగం కన్నా ప్రాణం మిన్న లాంటి ఎన్ని నినాదాలు రాసినా అవి నినాదాలకే పరిమితం అవుతున్నాయ‌న్నారు.

డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఇంటిదగ్గర మీకోసం మీ కుటుంబం ఎదురుచూస్తుందని గుర్తుంచుకోవాల‌ని సూచించారు. ముఖ్యంగా రోడ్డుపక్కన వాహనాలు నిలుపుతున్నారు.. మీ నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలు తీస్తున్నారని మర్చిపోవ‌ద్ద‌న్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపక్కన వాహనాలు నిలపొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అలా నిలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల‌ను కోరారు. శంషాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణం దిగ్భ్రాంతిని కలిగించింద‌న్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. అలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడం మనందరి బాధ్యత అన్నారు.

Read Also.. 

ఓఆర్ఆర్‌పై ఘోర ప్ర‌మాదం.. ఆరుగురు సిరిసిల్ల వాసులు మృతి

భ‌ద్రాచ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉంద‌ట‌.. తెలంగాణ‌పై కేంద్రం నిర్ల‌క్ష్యం..

బంగారం, వెండి ధ‌ర‌ల్లో భారీగా హెచ్చు త‌గ్గులు.. పెట్టుబ‌డిదారులు జాగ్ర‌త్త‌..

 

Advertisement
Advertisement