త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ORR | ఓఆర్ఆర్‌పై ఘోర ప్ర‌మాదం.. ఆరుగురు సిరిసిల్ల వాసులు మృతి

ORR | శంషాబాద్ వ‌ద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపై శుక్ర‌వారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వ‌ద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వ‌చ్చిన లారీ బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

S

Hyderabad | Published On May 1, 2026, 5.58 pm IST

ORR | ఓఆర్ఆర్‌పై ఘోర ప్ర‌మాదం.. ఆరుగురు సిరిసిల్ల వాసులు మృతి
Advertisement

ORR | త్రినేత్ర‌.న్యూస్ : శంషాబాద్ వ‌ద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డుపై శుక్ర‌వారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వ‌ద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వ‌చ్చిన లారీ బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును బ‌య‌ట‌కు లాగారు. అనంత‌రం కారులో ఉన్న మృత‌దేహాల‌ను వెలికితీశారు. ఆరుగురిలో ఇద్ద‌రు చిన్నారులు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

మృతులంతా సిరిసిల్ల వాసులు అని పోలీసులు పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లో నివాస‌ముంటున్న వీరు.. శుక్ర‌వారం ఉద‌యం యాద‌గిరిగుట్టకు వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అతి వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణంగా తెలుస్తోంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌మాదానికి గురైన కారు నంబ‌ర్ టీఎస్ 23 ఎఫ్ 2298.

మృతుల‌ను బొల్లి శివకుమార్, బొల్లి లాస్య, కోడం శ్రీనివాస్, కోడం శ్వేత, కోడం కృష్ణ చంద్ర, కోడం మాధవ్‌లుగా గుర్తించారు. వీరి స్వస్థలం సిరిసిల్లలోని సర్దార్ నగర్ కాగా.. హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో నివాసం ఉంటున్నారు.

Advertisement
Advertisement