Illegal trade of Oxytocin injections | నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజిక్షన్ల దందా గుట్టు రట్టు
Illegal trade of Oxytocin injections | శంషాబాద్ జోన్ (Shamshabad) పరిధిలో ప్రభుత్వ నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజిక్షన్ల దందాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచి, డైరీ ఫామ్ యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రధాన నిందితుడు అత్తేని కృష్ణ (Attheni Krishna) ను అరెస్ట్ చేశారు.
- 50,000 విలువైన బాటిళ్లు స్వాధీనం
- ప్రధాన నిందితుడి అరెస్టు, పరారీలో మరో ఇద్దరు
Illegal trade of Oxytocin injections | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ జోన్ (Shamshabad) పరిధిలో ప్రభుత్వ నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజిక్షన్ల దందాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ ఉంచి, డైరీ ఫామ్ యజమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రధాన నిందితుడు అత్తేని కృష్ణ (Attheni Krishna) ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి సుమారు రూ. 50,000 విలువైన 173 ఆక్సిటోసిన్ ఇంజిక్షన్ బాటిళ్లను (మొత్తం 43.250 లీటర్లు) స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ (DCP Vaibhav Gaikwad) తెలిపారు.
డీసీపీ ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మండలం మంఖాల్ గ్రామానికి చెందిన అత్తేని కృష్ణ మంఖాల్‌లోనే పదో తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబంతో కలిసి నివసిస్తూ డైరీ ఫామ్ వ్యాపారం చేస్తున్నాడు. జీవనోపాధి కోసం దాదాపు 15 సంవత్సరాల క్రితం తన గ్రామంలో ఒక డైరీ ఫామ్‌ను, అలాగే తుక్కుగూడలో "శ్రీకృష్ణ క్యాటిల్ ఫీడ్" పేరుతో ఒక పశుగ్రాసం దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. ఇతనికి 6 సంవత్సరాల క్రితం గుజరాత్ నుండి నిషేధిత ఇంజిక్షన్లను సరఫరా చేసే ఖాలెద్ అలీ అలియాస్ చత్రు సింగ్‌తో పరిచయం ఏర్పడింది.
ఖాలెద్ అలీ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను కృష్ణకు కేవలం రూ.50 లకే అమ్ముతానని ఆశ చూపాడు. భారీ లాభాలు ఉండటాన్ని గమనించిన కృష్ణ ఇంజెక్షన్లను కొనుగోలు చేసి స్థానిక డైరీ ఫామ్ నిర్వాహకులకు ఒక్కో బాటిల్‌కు రూ. 250 నుండి రూ.300 వరకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు.
ప్రధాన సరఫరాదారు ఖాలెద్ అలీ అలియాస్ చత్రు సింగ్ గుజరాత్ నుండి ఇంజిక్షన్లను భారీ పరిమాణంలో అక్రమంగా దిగుమతి చేసుకుని సరఫరా చేస్తున్నట్లు తేలింది. తుక్కుగూడకు చెందిన మూడో నిందితుడు సురేష్ కృష్ణ వద్ద క్రమం తప్పకుండా ఈ ఇంజిక్షన్లను కొనుగోలు చేసి తన డైరీలోని పశువులకు ఇస్తున్నట్లు గుర్తించాం. నమ్మదగిన సమాచారం మేరకు శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితుడు అత్తేని కృష్ణను పట్టుకుని 173 ఆక్సిటోసిన్ ఇంజిక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO) కి అప్పగించారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితులు ఖాలెద్ అలీ, సురేష్‌ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
ఈ అక్రమ దందాను అరికట్టిన శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి, ఎస్ఐలు ఎస్.శేషు, కె.నాగరాజు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పహాడీషరీఫ్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వల్ల కలిగే నష్టాలు..
- సంతానోత్పత్తి సమస్యలు రావడం, సహజ సిద్ధమైన గర్భధారణ సామర్థ్యం తగ్గడం
- గర్భాశయ సంబంధిత ఒత్తిడి (Uterine Stress) కి గురికావడం
- పొదుగు వాపు వ్యాధి (Mastitis - ఉమ్మడి ఇన్ఫెక్షన్) రావడం
- ఈ ఇంజెక్షన్ ఇస్తేనే పాలు ఇచ్చేలా పశువుల శరీరం దీనిపై పూర్తిగా ఆధారపడటం
మనుషులపై ప్రభావం ఇలా..
- ఆక్సిటోసిన్ ఇంజిక్షన్ ఇచ్చిన పశువుల పాలల్లో ఆ రసాయన అవశేషాలు ఉండిపోతాయి. ఈ పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల మనుషులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి
- ఈ పాలు తాగడం వల్ల పిల్లలు (ముఖ్యంగా ఆడపిల్లలు) చాలా చిన్న వయస్సులోనే హార్మోన్ల అసమతుల్యతకు గురై అకాల యుక్తవయస్సుకు చేరుకుంటారు.
- ఇటు పురుషులలో, అటు స్త్రీలలో తీవ్రమైన హార్మోన్ల లోపాలు తలెత్తి, మూడ్ స్వింగ్స్ (Mood Swings), సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది.
- గర్భిణులు ఈ పాలను తాగడం వల్ల గడువుకు ముందే ప్రసవ వేదన రావడం లేదా గర్భస్రావం (Miscarriage) జరిగే ప్రమాదం ఉంది.
- ఈ పాలను దీర్ఘకాలం పాటు వాడటం వల్ల గుండె జబ్బులు, కడుపు తిమ్మిరి (Stomach Cramping), కంటి చూపు మసకబారడం వంటి సమస్యలు వస్తాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




