Gold And Silver Prices Today | బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చు తగ్గులు.. పెట్టుబడిదారులు జాగ్రత్త..
Gold And Silver Prices Today | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ, బులియన్ మార్కెట్లు ప్రస్తుతం తీవ్ర అస్థిరత్వాన్ని ఎదుర్కొంటున్నాయి. పెట్టుబడిదారులకు మార్కెట్‌లో వేచి చూడాలా, పెట్టుబడులు పెట్టాలా అన్న విషయం అర్థం కావడం లేదు.
Gold And Silver Prices Today | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్రకటన చేస్తుండడంతో అంతర్జాతీయ ఈక్విటీ, బులియన్ మార్కెట్లు ప్రస్తుతం తీవ్ర అస్థిరత్వాన్ని ఎదుర్కొంటున్నాయి. పెట్టుబడిదారులకు మార్కెట్‌లో వేచి చూడాలా, పెట్టుబడులు పెట్టాలా అన్న విషయం అర్థం కావడం లేదు. ఈక్విటీ మార్కెట్లలో పతనం కొనసాగుతుండగా, బులియన్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర క్రితం సెషన్‌లో 0.18 శాతం మేర పడిపోయి 4,613 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 2.18 శాతం పెరిగి 75.35 డాలర్ల వద్ద స్థిరపడింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 241 పాయింట్లు పెరిగి 1,51,352 వద్ద స్థిరపడగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 6,481 పాయింట్లు పెరిగి 2,50,937 వద్ద ముగిసింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,093 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,20,744 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,50,930 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,09,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3,300 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,835 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,10,680గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,38,350 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,83,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3వేలు పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,320 ఉండగా, 8 గ్రాముల ధర రూ.90,560గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,13,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,32,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,500 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,65,000 ఉండగా, తులం ధర రూ.2,650గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ ధర కేజీకి రూ.10వేలు పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,70,000 ఉండగా, తులం ధర రూ.2,700 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



