Bhadrachalam | భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌లో ఉందట.. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం..
Bhadrachalam | తెలంగాణపై (Telangana) కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరోసారి తన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర ఏర్పాటుపై కూడా నిత్యం అక్కసు వెళ్లగక్కే బీజేపీ ప్రభుత్వ పెద్దలు.. నిధుల విడుల విషయంలో కూడా వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రాష్ట్రంలోని భూభాగాన్ని కూడా పొరుగు రాష్ట్రంలో చూపించి మరోసారి తెలంగాణపై తన వ్యతిరేకతను కేంద్రం చాటుకున్నది.
Bhadrachalam | త్రినేత్ర.న్యూస్: తెలంగాణపై (Telangana) కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం మరోసారి తన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్ర ఏర్పాటుపై కూడా నిత్యం అక్కసు వెళ్లగక్కే బీజేపీ ప్రభుత్వ పెద్దలు.. నిధుల విడుల విషయంలో కూడా వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రాష్ట్రంలోని భూభాగాన్ని కూడా పొరుగు రాష్ట్రంలో చూపించి మరోసారి తెలంగాణపై తన వ్యతిరేకతను కేంద్రం చాటుకున్నది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం (Bhadrachalam) ఆంధ్రప్రదేశ్‌లో ఉందట. స్వీయ గణన (Self Enumeration) వెబ్‌సైట్‌లో భద్రాచలం పట్టణాన్ని ఎంటర్ చేసినప్పుడు అది చూపించడం లేదు. దీంతో భద్రాచలం వాసుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఇటీవల పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే వారికి తెలంగాణపై ఎంత వివక్ష ఉందో అర్థమవుతున్నది.
రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, భద్రాచలం పట్టణంలోని 7 గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. దాని నుంచి ఇంకా కోలుకోక ముందే, భద్రాచలం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనిది కాదంటూ సందేశం రావడంతో పట్టణవాసులు హతాశులయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనగణనలో భాగంగా స్వీయ గణనకు అవకాశం కల్పించింది. కుటుంబ యజమానులు తమ వివరాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా భద్రాచలం పట్టణవాసులు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం వెబ్‌సైట్‌లో భద్రాచలం పట్టణాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తే, జియో మ్యాపింగ్‌లో తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైందన్న సందేశం వెలువడుతున్నది. దీంతో తాము స్వీయ గణన ఎలా పూర్తి చేసుకోవాలో తెలియక పట్టణవాసులు తలలు పట్టుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఎంపిక చేసి, జియో లొకేషన్‌లో ఆన్‌లైన్ నమోదు కోసం తాము నివసిస్తున్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని చూస్తే, ‘సరిహద్దు ప్రాంతం పరిమితం చేయబడింది.. జియో కోడింగ్ తెలంగాణ ప్రాంతానికే పరిమితం’ అనే సందేశాలు ఆ వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నాయి. వెబ్‌సైట్‌లో భద్రాచలం తెలంగాణ ప్రాంతం వెలుపల చూపించడంపై తహసీల్దార్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా, సమస్య తన దృష్టికి వచ్చిందని, ఈ అంశాన్ని జనాభా లెక్కల సాంకేతిక బృందానికి నివేదించినట్టు తెలిపారు. సోమవారం నాటికి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రస్తుతం గూగుల్ మ్యాప్‌లో భద్రాచలం పట్టణం తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా చూపించడం భద్రాచలం పట్టణవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
సంబంధిత వార్తలు

KCR | బావమరిది శ్రీనివాసరావు పార్థివదేహానికి కేసీఆర్ నివాళి
ఆగస్టు 14, 2026

Malla Reddy | 22A యాడికెళ్లొచ్చింది? ఎవల్దెచ్చిర్రు.. మీరు ఇమ్మిడియేట్లి దిగి బొంరాస్‌పేట రైతుల భూములు కాపాడాలే
ఆగస్టు 14, 2026

MLA Sanjay | డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో రేవంత్ బాధపడుతున్నరు
ఆగస్టు 14, 2026
తాజావార్తలు
- ●HDFC Mid Cap Fund | రూ.10 లక్షలను రూ.1కోటిగా మార్చిన ఫండ్ ఇది.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..
- ●Manan Kumar Mishra | నల్సార్ వివాదం.. ఇంతకీ ఎవరీ మనన్ కుమార్ మిశ్రా..?
- ●Telangana Cabinet | ఆటో డ్రైవర్లకు కొత్త పథకం.. సబ్సిడీ రూ. లక్షా 50 వేలు
- ●Prabhas | ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా డీపీ ఛేంజ్ చేసిన ప్రభాస్ - ఇన్నాళ్లు బాహుబలి ... ఇకపై ఫౌజీ
- ●1947లో జెండా ఎగిరినా… గోవా, హైదరాబాద్, కాశ్మీర్ ఇంకా పరాయి చేతుల్లోనే!
- ●Telangana Cabinet | సీఎం రేవంత్ కేబినెట్ నిర్ణయాలు ఇవే..

HDFC Mid Cap Fund | రూ.10 లక్షలను రూ.1కోటిగా మార్చిన ఫండ్ ఇది.. ఇన్వెస్టర్లపై కాసుల వర్షం..

Manan Kumar Mishra | నల్సార్ వివాదం.. ఇంతకీ ఎవరీ మనన్ కుమార్ మిశ్రా..?

Telangana Cabinet | ఆటో డ్రైవర్లకు కొత్త పథకం.. సబ్సిడీ రూ. లక్షా 50 వేలు

Prabhas | ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా డీపీ ఛేంజ్ చేసిన ప్రభాస్ - ఇన్నాళ్లు బాహుబలి ... ఇకపై ఫౌజీ



