Road Accident | కారును ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి
Road Accident | బైక్ రేసింగ్ సరదా ఐదుగురు అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నది. ఈ ఘోర ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని పాలకొండ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. అత్యంత వేగంగా దూసుకువచ్చిన స్పోర్ట్స్ బైక్.. కారును ఢీకొట్టింది.
Road Accident | త్రినేత్ర.న్యూస్ : బైక్ రేసింగ్ సరదా ఐదుగురు అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నది. ఈ ఘోర ప్రమాదం మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని పాలకొండ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. అత్యంత వేగంగా దూసుకువచ్చిన స్పోర్ట్స్ బైక్.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్పోర్ట్స్ బైక్, కారు నుజ్జునుజ్జు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2)గా గుర్తించారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వారిని హైదరాబాద్‌కు చెందిన యాకుబ్ అఫ్జల్(25), మరో యువకుడిని అతని స్నేహితుడిగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బైక్ 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ రోడ్డు ప్రమాదంలో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డులో రాత్రి వేళ యువకులు బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. బైపాస్‌ను బైక్ రేసర్లకు అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Srinivas Goud | పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసే వరకు పోరాటం ఆపం : శ్రీనివాస్ గౌడ్
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



