త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | థియేట‌ర్ ఓపెనింగ్‌కు వ‌చ్చే రేవంత్‌కు నిరుద్యోగుల‌ను క‌లిసే ద‌మ్ముందా: హ‌రీశ్‌రావు

Harish Rao | ఒక‌ సినిమా థియేట‌ర్ ఓపెనింగ్ కోసం అశోక్‌న‌గ‌ర్‌ (Ashok Nagar) కు వ‌స్తున్న ముఖ్య‌మంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి అదే అశోక్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగుల‌ను క‌లిసే ద‌మ్మందా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత హ‌రీశ్‌రావు (Harish Rao) ప్ర‌శ్నించారు.

A

Telangana | Published On Jan 9, 2026, 1.22 pm IST

Harish Rao | థియేట‌ర్ ఓపెనింగ్‌కు వ‌చ్చే రేవంత్‌కు నిరుద్యోగుల‌ను క‌లిసే ద‌మ్ముందా: హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | ఒక‌ సినిమా థియేట‌ర్ ఓపెనింగ్ కోసం అశోక్‌న‌గ‌ర్‌ (Ashok Nagar) కు వ‌స్తున్న ముఖ్య‌మంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి అదే అశోక్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగుల‌ను క‌లిసే ద‌మ్మందా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేత హ‌రీశ్‌రావు (Harish Rao) ప్ర‌శ్నించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాహుల్‌గాంధీతో క‌లిసి అశోక్‌న‌గ‌ర్ పోయి త‌మ ప్ర‌భుత్వం వ‌స్తే మొద‌టి ఏడాదిలోనే రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు. రేవంత్ ప్రారంభానికి వెళ్లే థియేట‌ర్ ప‌క్క‌నే సెంట్ర‌ల్ లైబ్రెరీ ఉంద‌ని, ఇప్పుడు ఒక‌సారి అక్క‌డికి పోయిరావాల‌ని స‌వాల్ చేశారు. అక్క‌డికి వెళ్లి, ఆనాడు ఏం మాట ఇచ్చాడో, ఇప్ప‌టికి ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేశారో ఒక‌సారి నిరుద్యోగుల‌తో మాట్లాడాల‌ని సూచించారు. జాబ్ కేలెండ‌ర్‌, నిరుద్యోగ భృతి, విద్యార్థినుల‌కు స్కూటీలు, రెండు ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీ గురించి వారికి చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఎన్నిక‌ల‌కు ముందు వెళ్లిన అశోక్‌న‌గ‌ర్ సెంట్ర‌ల్ లైబ్రెరీ ఇప్పుడు గుర్తుకురావ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. స‌రూర్‌న‌గ‌ర్ స్టేడియంలో ప్రియాంకా గాంధీని తీసుకువ‌చ్చి, యూత్ పాల‌సీ అని ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల‌కు ప‌రీక్ష‌కు ఫీజే ఉండ‌ద‌ని చెప్పార‌ని, కానీ ఇప్పుడు ముక్కు పిండి ఫీజులు వ‌సూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బ్యాక్‌లాగ్ పోస్టులు భ‌ర్తీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ వాటి ఊసే లేకుండా పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అన్నీ ఎగ్గొట్టి, పోలీసుల‌ను పెట్టుకుని చాటుగా తిరుగుతున్నాడ‌ని నిప్పులు చెరిగారు.

ఇటీవ‌ల మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ అంద‌రికీ ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌లేమ‌ని చేతులెత్తేసాడ‌ని మండిప‌డ్డారు. జాబ్ కేలెండ‌ర్ అని పెట్టిన ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క జాబ్‌లెస్ కేలెండ‌ర్‌గా మార్చాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి అశోక్‌న‌గ‌ర్‌కు వెళ్తుంటే వేల మంది పోలీసుల‌ను భ‌ద్ర‌త‌గా పెట్ట‌కున్నాడ‌ని విమ‌ర్శించారు. సినిమా థియేట‌ర్ ప్రారంభానికి వేల‌మంది పోలీసులు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. గ‌త రెండు రోజుల పాటు నిరుద్యోగులు జాబ్ కేలెండ‌ర్ విడుద‌ల చేసి, నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయాల‌ని నిర‌స‌న తెలిపితే పోలీసులు బూతులు తిట్టి దాడి చేశార‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రికి ధైర్యం, చిత్త‌శుద్ది ఉంటే అశోక్‌న‌గ‌ర్ సెంట్ర‌ల్ లైబ్రెరీకి వెళ్లాల‌ని హిత‌వు ప‌లికారు. లేనిప‌క్షంలో నిరుద్యోగ యువ‌త‌ను మోసం చేసిన‌ట్లుగానే భావిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement