త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | ప్ర‌తిప‌క్ష నేత‌గా కాంట్రాక్ట‌ర్ల‌పై ఆరోప‌ణ‌లు.. సీఎంగా వారికే కాంట్రాక్టులు: మ‌న్నె క్రిశాంక్‌

Manne Krishank | ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కాంట్రాక్ట‌ర్ల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా వారికే కాంట్రాక్టులు క‌ట్ట‌బెడుతున్నార‌ని బీఆర్ఎస్ (BRS) నేత మ‌న్నె క్రిశాంక్ (Manne Krishank) మండిప‌డ్డారు.

A

Telangana | Published On Jan 9, 2026, 4.17 pm IST

Manne Krishank | ప్ర‌తిప‌క్ష నేత‌గా కాంట్రాక్ట‌ర్ల‌పై ఆరోప‌ణ‌లు.. సీఎంగా వారికే కాంట్రాక్టులు: మ‌న్నె క్రిశాంక్‌
Advertisement

Manne Krishank | ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కాంట్రాక్ట‌ర్ల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా వారికే కాంట్రాక్టులు క‌ట్ట‌బెడుతున్నార‌ని బీఆర్ఎస్ (BRS) నేత మ‌న్నె క్రిశాంక్ (Manne Krishank) మండిప‌డ్డారు. 2023 కంటే ముందు టీపీసీసీ (TPCC) అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు రేవంత్‌రెడ్డి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేందుకు ర‌క‌ర‌కాల అబ‌ద్ధాలు ఆడార‌ని గుర్తు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌ (Telangana Bhavan) లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో క్రిశాంక్ మాట్లాడుతూ వ్యాపారులు, కాంట్రాక్ట‌ర్లతో అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ (KCR), కేటీఆర్‌ (KTR)ల‌కు సంబంధాలు అంట‌గ‌ట్టేవార‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌మ బంధువులు, తెలంగాణ ద్రోహుల‌కు కాంట్రాక్టులు క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆరోపించేవార‌ని చెప్పారు. ఈ అంశాల‌పైనే కొన్ని డ‌జ‌న్ల‌కొద్ది ప్రెస్ మీట్లు పెట్టార‌ని పేర్కొన్నారు.

అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపించిన రేవంత్‌... ఇప్పుడు వారికే కాంట్రాక్టులు అప్ప‌జెప్పుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. కేసీ పుల్ల‌య్య అనే కంపెనీ ప్రొద్దుటూరు వారిద‌ని, కేసీ పుల్ల‌య్య ప్రాజెక్టు కేటీఆర్‌ను క‌లిసిన త‌రువాత కేపీసీ ప్రాజెక్టుగా మారింద‌ని అర‌డ‌జ‌ను సార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పార‌ని విమ‌ర్శించారు. అదే కంపెనీకి చెందిన అనిల్‌కుమార్ శెట్టి ఇప్పుడు రేవంత్ సోద‌రుడు తిరుప‌తిరెడ్డితో స‌న్నిహితంగా ఉన్నార‌ని చెప్పారు. కేటీఆర్‌కు స‌న్నిహితుడైతే కేపీసీ ప్రాజెక్టుకు రూ.400 కోట్ల ప్రాజెక్టు ఎందుకు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. తిరుప‌తిరెడ్డికి ద‌గ్గ‌రైనందుకే కేపీసీ ప్రాజెక్టుకు కేటీపీఎస్‌లో రూ.400 కోట్ల ప్రాజెక్టు ద‌క్కింద‌ని ఆరోపించారు.

గ‌తంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫీనిక్స్ కంపెనీకి కేటీఆర్‌తో సంబంధాలు అంట‌గ‌ట్టార‌ని, అదే ఫీనిక్స్ వాళ్లు ఇప్పుడు రేవంత్‌తో అంట‌కాగుతున్నార‌ని మండిప‌డ్డారు. ఎన్ని క‌మిష‌న్లు తీసుకుని అప్పుడు విమ‌ర్శించిన వారికి కాంట్రాక్టులు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు. అప్పుడు తెలంగాణ ద్రోహి అన్న‌వారికి కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారో రేవంత్ స‌మాధానం చెప్పాల‌న్నారు. అప్ప‌ట్లో కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై విమ‌ర్శ‌లు చేసినందుకు రేవంత్ బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. గ‌తంలో రేవంత్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ద‌మ్ముంటే విచార‌ణ జ‌రిపించాల‌ని సూచించారు. ఆరోపణలు చేసిన వారికే రేవంత్ కాంట్రాక్టులు ఇస్తున్నందుకు అపుడు నిరాధార ఆరోపణలు చేశానని ఒప్పుకోవాలని హిత‌వు ప‌లికారు. రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌ల‌పై బుర‌ద‌జ‌ల్లి అధికారంలోకి వ‌చ్చార‌ని విమ‌ర్శించారు.

ఈ మ‌ధ్య రేవంత్‌రెడ్డి స్క్రిప్ట్‌నే క‌విత చ‌దివార‌ని ఆరోపించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హం, అమ‌ర‌వీరుల జ్యోతి ప్రాజెక్టుల్లో అవినీతి గురించి ఆమె మాట్లాడార‌ని చెప్పారు. రేవంత్‌రెడ్డి పాత స్క్రిప్ట్‌నే క‌విత తిర‌గ‌దోడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ముఖాలు మారాయ‌ని, కానీ విమ‌ర్శ‌లు పాత‌వేన‌ని ఎద్దేవా చేశారు. ఆరోప‌ణ‌లు చేసిన వారికే కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్ట‌డంపై రేవంత్ స‌మాధానం చెప్పాల‌ని, ఆయ‌న‌కు వ‌కాల్తా పుచ్చుకుంటున్న వారు కూడా స‌మాధానం చెప్పాల‌న్నారు. ముక్కు నేల‌కు రాసి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement