త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

WPL 2026 | అట్ట‌హాసంగా మొద‌లైన వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌.. అల‌రించిన హ‌ర్నాజ్‌, జాక్వెలిన్‌

WPL 2026 | వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ (WPL) 2026 సీజన్ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. నవీ ముంబ‌యిలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబ‌యి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుక జరిగింది.

P

Sports | Published On Jan 9, 2026, 8.20 pm IST

WPL 2026 | అట్ట‌హాసంగా మొద‌లైన వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌.. అల‌రించిన హ‌ర్నాజ్‌, జాక్వెలిన్‌
Advertisement

WPL 2026 | వుమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ (WPL) 2026 సీజన్ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. నవీ ముంబ‌యిలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబ‌యి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుక జరిగింది. ఈ వేడుకలో ప్రముఖ నటి, మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రముఖ రాపర్ హనీ సింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ఈ కార్య‌క్ర‌మాలు 45 నిమిషాల పాటు సాగింది.


వేడుక ప్రారంభం కావడానికి ముందే టాస్ జరిగింది. డ‌బ్ల్యూపీఎల్ మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్ ముంబ‌యి ఇండియన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టాస్ తర్వాత ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం మొద‌లైంది. హర్నాజ్ సంధు వేదికపైకి వచ్చింది. ఆ తర్వాత జాక్వెలిన్ తన ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. చివరగా, హనీ సింగ్ వచ్చి తన పాటలతో ఆటగాళ్లను, ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. హనీ సింగ్ వేదికపైకి రాగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. డగౌట్ నుంచే వేదికపైకి బిలియ‌నీర్ పాట‌తో స్టేజీ ఎక్కాడు. సన్ రాజా మంద్ హై... బ్లూ ఐస్, లుంగీ డాన్స్, పార్టీ ఆల్ నైట్ త‌దిత‌ర వంటి పాటలు పాట‌గా అభిమానులు కేరింత‌లు కొట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement