Harish Rao | సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం.. రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు హెచ్చరిక
Harish Rao | సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. నాపై కోపం ఉంటే నా మీదనే చూపించు.. సిద్దిపేట ప్రజలపై కాదు అని ఆయన అన్నారు.
నాపై కోపం ఉంటే నా మీద చూపించు..
సిద్దిపేట ప్రజలపై కాదు
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోం అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. నాపై కోపం ఉంటే నా మీదనే చూపించు.. సిద్దిపేట ప్రజలపై కాదు అని ఆయన అన్నారు. సిద్దిపేట బీజేపీ పట్టణ అధ్యక్షులు పత్రి శ్రీనివాస్, సీనియర్ నాయకులు హనుమంత్ రావు తమ అనుచరులతో కలిసి నేడు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఒకప్పుడు సిద్దిపేటలో మంచినీళ్ల కష్టాలు ఎలా ఉండేవో, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకంటే మీకే బాగా తెలుసు. ఒకప్పుడు నీళ్ల కోసం సిద్దిపేటకు పిల్లని ఇవ్వడానికి కూడా భయపడేవారు. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మురికి కాలువలు గుర్తుకొచ్చేవి. ఇప్పుడు పందులు మాయమయ్యాయి. మోరీల స్థానంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వచ్చాయి. సైకిళ్ల మీద నీళ్లు మోసే బాధలు పోయి, ఇంటింటికి నల్లా నీళ్లు వచ్చాయి. సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి తెలియాలంటే వేరే ఊరికో, వేరే నగరానికో వెళ్లి చూస్తే అర్థమవుతుంది. కమ్యూనిటీ హాల్స్, చెత్త సేకరణ, వీధి దీపాలు.. ఇలా ఏది చూసినా సిద్దిపేట రాష్ట్రానికే మోడల్‌గా నిలిచింది. సిద్దిపేట చదువుల తల్లిగా మారింది. మెడికల్ కాలేజ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, నర్సింగ్, మహిళా డిగ్రీ కాలేజీలతో విద్యాక్షేత్రంగా వెలుగొందుతోంది. వైద్యంలోనూ అగ్రగామిగా నిలిచింది. దేవాలయాల జిల్లాగా సిద్దిపేట కీర్తి గడించింది. కోమటి చెరువు పర్యాటక కేంద్రంగా మారి, ఇతర జిల్లాల వారిని ఆకర్షిస్తోంది అని హరీశ్‌రావు తెలిపారు.
మీ పరువు, ప్రతిష్ట పెరిగేలా పనిచేశాను
మీ ఎమ్మెల్యేగా మీ పరువు, ప్రతిష్ట పెరిగేలా పనిచేశాను. సిద్దిపేట ప్రజలను ఎవరైనా చూస్తే అదృష్టవంతులు అనే స్థాయికి తీసుకువచ్చాను. 30, 40 ఏళ్ల సిద్దిపేట ప్రజల కలను కేసీఆర్ నిజం చేసి జిల్లాను ఇచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి జిల్లాలు ఎక్కువయ్యాయని సాకు చూపి సిద్దిపేట జిల్లాను రద్దు చేసి మళ్ళీ సంగారెడ్డిలో కలపాలని కుట్ర చేస్తున్నారు. జిల్లా రద్దయితే కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి, ఎస్పీ ఆఫీస్, ఇరిగేషన్ ఆఫీసులన్నీ పోతాయి. సిద్దిపేట అభివృద్ధి కుంటుపడుతుంది. రేవంత్ రెడ్డికి నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి కానీ, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానంటే ఊరుకోం. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సిద్దిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటాం. అవసరమైతే మరో ఉద్యమం చేస్తాం అని హరీశ్‌రావు హెచ్చరించారు.
నా శక్తినంతా సిద్దిపేట అభివృద్ధికే ధారపోశాను..
సిద్దిపేట అంటే నా కుటుంబం. దసరా అయినా, రంజాన్ అయినా మీ మధ్యలోనే ఉంటా. నా శక్తినంతా సిద్దిపేట అభివృద్ధికే ధారపోశాను. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మనవాళ్లే గెలవాలి. కౌన్సిలర్, చైర్మన్ మనవాళ్లే ఉంటేనే అభివృద్ధి ముందుకు సాగుతుంది. రేవంత్ రెడ్డితో ఇంకా కొట్లాడుదాం, విడిచి పెట్టేదే లేదు. కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యేదాకా, తెలంగాణ మళ్ళీ బాగుపడేదాకా కొట్లాడుదాం అని గులాబీ శ్రేణులకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



