Mana Shankara Vara Prasad Garu | ఏపీలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు గ్రీన్‌సిగ్నల్ – తెలంగాణలో డైలమా?
చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు మూవీకి ఏపీలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో పర్మిషన్స్ వస్తాయా? లేదా? అన్నది డైలమాలో పడింది.
Mana Shankara Vara Prasad Garu | సంక్రాంతి సినిమాల టికెట్ రేట్లు, బెనిషిట్ షోల వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాజాసాబ్ మూవీకి ఏపీలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పర్మిషన్స్ రాగా...తెలంగాణలో మాత్రం ప్రభుత్వం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. టికెట్ రేట్ల పెంపు జీవోను అర్ధరాత్రి తర్వాత జారీ చేయగా...శుక్రవారం రోజు ఈ జీవోను హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజాసాబ్ తర్వాత రిలీజయ్యే సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. రాజాసాబ్‌కు ఎదురైన ఇబ్బందులను దృష్ట్యా చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో ఎంత పెరిగాయంటే?
తాజాగా ఏపీలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ ధరలు పెంచుతూ కూటమి ప్రభుత్వం జీవోను జారీ చేసింది. రిలీజ్‌కు ఒక రోజు ముందుగా 11వ తేదీన స్పెషల్ షోకు అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోకు టికెట్ ధరను 500లుగా నిర్ణయించింది. రిలీజ్ రోజు నుంచి పది రోజుల వరకు సింగిల్ స్క్రీన్స్‌లో వంద, మల్టీప్లెక్స్‌లో 125 రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ జారీ చేసింది.
తెలంగాణలో...
ఏపీలో మూడు రోజుల ముందే జీవో రిలీజ్ కాగా...తెలంగాణలో పరిస్థితి ఏమిటన్నది అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రాజాసాబ్‌కు ఏపీలో గురువారం చాలా చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ నైజాంపై పడింది. ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే నైజాంలో రాజాసాబ్ చాలా తక్కువ ఓపెనింగ్స్‌ను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. మన శంకర వర ప్రసాద్‌గారు టాక్ బాగుంటే ఓకే...ఏ మాత్రం అటు ఇటు అయినా రాజాసాబ్ పరిస్థితే ఎదురవుతుందని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు శుక్రవారం జీవో 120 ప్రకారం టికెట్ ధరలు 350 రూపాయలు దాటకూడదంటూ హైకోర్టు చెప్పింది. ఒకవేళ టికెట్ ధరలు పెంచాలంటే 120 జీవోను మార్చాలని అన్నది. ఒక్క రోజులో జీవోలో మార్పులు చేయడం సాధ్యమేనా? అందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అన్నది టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ తీసుకోకుండానే మేకర్స్ మన శంకర వరప్రసాద్‌గారు సినిమాను విడుదల చేయచ్చని ప్రచారం జరుగుతోంది.
మన శంకర వరప్రసాద్‌గారు మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



