త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Budget 2026 | ఈ నెల 28 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు.. తేదీలు ప్ర‌క‌టించిన కేంద్ర‌మంత్రి..!

Budget 2026 | కేంద్రం సిఫార‌సు మేర‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను నిర్వ‌హించేందుకు ఆమోదం తెలిపారు. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. ఈ స‌మావేశాలు రెండుద‌శ‌ల్లో జ‌రుగ‌నున్నాయి.

P

National | Published On Jan 9, 2026, 9.26 pm IST

Budget 2026 | ఈ నెల 28 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు.. తేదీలు ప్ర‌క‌టించిన కేంద్ర‌మంత్రి..!
Advertisement

Budget 2026 | కేంద్రం సిఫార‌సు మేర‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌ను నిర్వ‌హించేందుకు ఆమోదం తెలిపారు. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. ఈ స‌మావేశాలు రెండుద‌శ‌ల్లో జ‌రుగ‌నున్నాయి. తొలి ద‌శ జ‌న‌వ‌రి 28న ప్రారంభ‌మై.. ఏప్రిల్ 2 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. బడ్జెట్ సమావేశాల తొలి దశ ఫిబ్రవరి 13న ముగియ‌నున్న‌ది. మార్చి 9న తిరిగి స‌మావేశ‌మ‌వుతాయి. ప్ర‌తి ఏడాది ఫిబ్ర‌వ‌రి 1న ఆర్థిక మంత్రి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ సారి ఆదివారం రావ‌డంతో బ‌డ్జెట్‌ను ఏ రోజున ప్ర‌వేశ‌పెడుతార‌నే ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే, బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఆధారంగా ఈ సారి కూడా బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీనే ప్రవేశపెట్టే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు, అర్థవంతమైన చర్చలు జ‌రిగేలా చూసేందుకు ఈ సారి స‌మావేశాలు రెండుద‌శ‌ల్లో నిర్వ‌హిస్తున్న‌ట్లుగా సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌న‌వ‌రి 28న మొద‌ల‌వుతాయి. రెండువారాలు కొన‌సాగి ఫిబ్ర‌వ‌రి 13న ముగుస్తాయి. మొద‌టి ద‌శ త‌ర్వాత పార్ల‌మెంట్‌కు సెల‌వులుంటాయి. ఈ స‌మ‌యంలో పార్ల‌మెంట‌రీ క‌మిటీలు సాధార‌ణంగా వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల గ్రాంట్ల‌పై డిమాండ్స్‌పై అధ్య‌య‌నం చేస్తాయి. ఇక రెండో ద‌శ పార్ల‌మెంట్ స‌మావేశాలు మార్చి 9న మొద‌ల‌వుతాయి. ఏప్రిల్ 2న ముగుస్తాయి. అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌లు, కేంద్రీకృత పాల‌న దిశ‌గా ఓ కీల‌క‌మైన ముంద‌డుగుగా ప్ర‌క‌ట‌న‌లో కేంద్రం పేర్కొంది. మార్చి 9న ప్రారంభమయ్యే రెండవ దశలో బడ్జెట్ ప్రతిపాదనలపై వివరణాత్మక చర్చ, ఆమోదం ఉంటుంది. రాష్ట్ర‌ప‌తి ఆమోదంతో పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు సంబంధించిన షెడ్యూల్ ఖ‌రారైంది.

Advertisement

తాజావార్తలు

Advertisement