Telangana Assembly | అసెంబ్లీకి హాజరైన ఆ నలుగురు ఎమ్మెల్యేలు..! ఏ పార్టీ వీరిది..?
Telangana Assembly | శాసనసభ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాము ఫిరాయింపులకు పాల్పడలేదు.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పదేపదే ఉద్ఘాటిస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి విచిత్రంగా ఉంది.
Telangana Assembly | త్రినేత్ర.న్యూస్ : శాసనసభ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాము ఫిరాయింపులకు పాల్పడలేదు.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పదేపదే ఉద్ఘాటిస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈ శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నామని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఆ ప్రకటనకు కట్టుబడి ఇవాళ ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా సభకు హాజరు కాలేదు. కానీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి కూడా బీఆర్ఎస్‌లోనే ఉంటున్నట్టు ప్రకటించిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు.
మరి ఈ నలుగురు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగితే.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కదా..? సభకు ఎందుకు వచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు వీరు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోలేకపోతున్నారని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సభలో ఈ నలుగురు కనిపించడంతో పార్టీ ఫిరాయింపులపై మరో సారి చర్చ జరిగింది. అసెంబ్లీ లాబీల్లోనూ ఈ అంశంపై పలువురు నాయకులు గుసగుసలాడినట్లు తెలుస్తోంది.
ఇక తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లు కడియం శ్రీహరి పలు వేదికల మీద ప్రకటించారు. తెల్లం వెంకట్రావ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. వీరిద్దరూ కూడా ఇవాళ సభకు వచ్చారు. ఇక బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సైతం సభలో కనిపించారు. దానం నాగేందర్ తన నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






