త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan Trailer | జ‌న‌నాయ‌గ‌న్ ట్రైల‌ర్ – భ‌గ‌వంత్ కేస‌రి ఫ్రేమ్ టూ ఫ్రేమ్ రీమేక్ – త‌మిళ్ కోసం చేసిన మార్పులు ఇవే

ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ ట్రైల‌ర్ శ‌నివారం విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్‌తో భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్‌గా ద‌ళ‌ప‌తి విజ‌య్‌ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు క‌న్ఫామ్ అయ్యింది. భ‌గ‌వంత్ కేస‌రిని ఫ్రేమ్ టూ ఫ్రేమ్ కాపీ చేసి జ‌న‌నాయ‌గ‌న్‌ను రూపొందించిన‌ట్లుగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు.

N

Entertainment | Published On Jan 3, 2026, 9.03 pm IST

Jana Nayagan Trailer | జ‌న‌నాయ‌గ‌న్ ట్రైల‌ర్ – భ‌గ‌వంత్ కేస‌రి ఫ్రేమ్ టూ ఫ్రేమ్ రీమేక్ – త‌మిళ్ కోసం చేసిన మార్పులు ఇవే
Advertisement

Jana Nayagan Trailer | కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తున్న జ‌న‌నాయ‌గ‌న్ మూవీ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. త‌న చివ‌రి సినిమా ఇదేనంటూ ఇటీవ‌ల ఈ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌క‌టించాడు. జ‌న‌నాయ‌గ‌న్ త‌ర్వాత పూర్తిగా రాజ‌కీయాల‌కే అంకిత‌మై ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. దాంతో జ‌న‌నాయ‌గ‌న్‌పై త‌మిళ నాట భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ఈ మూవీ విడుద‌ల‌కాబోతుంది. టాలీవుడ్‌లో విజ‌య్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని జ‌న‌నాయ‌కుడు పేరుతో ఈ సినిమాను తెలుగులోకి డ‌బ్ చేస్తున్నారు.

భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్‌...

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేక్‌గా జ‌న‌నాయ‌గ‌న్ రూపొందుతోన్నట్లుగా కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ రీమేక్ వార్త‌ల‌ను ఇన్నాళ్లు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ చేయ‌లేదు. ఈ రీమేక్ గురించి ఇటీవ‌ల ప్ర‌మోష‌న్స్‌లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు డైరెక్ట‌ర్ హెచ్ వినోథ్ కూడా స‌మాధానం దాట‌వేశారు. ఇది హండ్రెడ్ ప‌ర్సెంట్ ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ అంటూ తెలివిగా ఆన్స‌ర్ ఇచ్చారు.

ట్రైల‌ర్ రిలీజ్‌...

జ‌న‌నాయ‌గ‌న్ ట్రైల‌ర్ శ‌నివారం రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌తో ఇది భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్ అన్న‌ది తేలిపోయింది. భ‌గ‌వంత్ కేస‌రి మూల‌క‌థ‌ను తీసుకొని విజ‌య్ ఇమేజ్‌కు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి జ‌న‌నాయ‌గ‌న్‌ను రూపొందించిన‌ట్లు ట్రైల‌ర్ ద్వారా క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది. భ‌గ‌వంత్ కేస‌రిలో బాల‌కృష్ణ పోలీస్ ఆఫీస‌ర్‌గా, ఆ త‌ర్వాత ఖైదీగా క‌నిపిస్తారు. శ్రీలీల‌ను బాల‌కృష్ణ ఆర్మీలో జాయిన్ చేయించాల‌ని ప్ర‌య‌త్నించ‌డం, వీరిద్ద‌రి ఎమోష‌న‌ల్ జ‌ర్నీతో ఈ సినిమా సాగుతుంది.

సేమ్ టూ సేమ్‌...

జ‌న‌నాయ‌గ‌న్ ట్రైల‌ర్‌లో విజ‌య్ పోలీస్ ఆఫీస‌ర్‌గా, ఆ త‌ర్వాత ఖైదీగా క‌నిపించారు. త‌న కూతురు మ‌మితా బైజును ఆర్మీలో జాయిన్ చేయించాల‌ని అనుకునే సీన్స్‌తోనే ఈ ట్రైల‌ర్ సాగింది. జ‌న‌నాయ‌గ‌న్ ట్రైల‌ర్‌లోని చాలా సీన్లు భ‌గ‌వంత్ కేస‌రికి సిమిల‌ర్‌గా ఉన్నాయి. జైల్ ఫైట్‌, ఇంట‌ర్వెల్ ఎపిసోడ్‌, ఫ్యాక్ట‌రీ ఫైట్ సీక్వెన్స్ రెండింటిలో ఒకేలా ఉన్నాయి. విజ‌య్‌ క్యారెక్ట‌రైజేష‌న్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, విల‌న్ పాత్ర...ఇలా ప్ర‌తీదీ భ‌గ‌వంత్ కేస‌రి ఛాయ‌ల‌తోనే సాగింది.
భగవంత్ కేసరితో పోలిస్తే భారీ కాన్వాస్‌తో జ‌న‌నాయ‌గ‌న్‌ను రూపొందించారు. మేకింగ్‌లో రిచ్‌నెస్ క‌నిపిస్తోంది. విజ‌య్ పాలిటిక్స్ ఎంట్రీ కోస‌మే కొన్ని స్పెష‌ల్ డైలాగ్స్‌, సీన్ల‌ను యాడ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.
భ‌గ‌వంత్ కేస‌రిలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించ‌గా... జ‌న‌నాయ‌గ‌న్‌లో పూజా హెగ్డే క‌థానాయిక‌గా క‌నిపించింది. శ్రీలీల పాత్ర‌ను మ‌మితాబైజు చేసింది. భ‌గ‌వంత్ కేస‌రిలో అర్జున్ రాంపాల్ విల‌న్‌గా న‌టించ‌గా... జ‌న‌నాయ‌గ‌న్‌లో బాబీ డియోల్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నారు.
భ‌గ‌వంత్ కేస‌రి, జ‌న‌నాయ‌గ‌న్ సినిమాల‌కు కంపేర్ చేస్తూ నెటిజ‌న్లు పెడుతున్న ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement