త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | రేవంత్ పాల‌న‌పై రాహుల్‌గాంధీకి దాసోజు ఘాటు లేఖ‌

Dasoju Sravan Kumar | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్ర‌భుత్వ పాల‌న‌పై కాంగ్రెస్ (Congress) అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఎమ్మెల్సీ (MLC) డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు (Dasoju Sravan Kumar) బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

A

Telangana | Published On Jan 6, 2026, 3.44 pm IST

Dasoju Sravan Kumar | రేవంత్ పాల‌న‌పై రాహుల్‌గాంధీకి దాసోజు ఘాటు లేఖ‌
Advertisement

Dasoju Sravan Kumar | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్ర‌భుత్వ పాల‌న‌పై కాంగ్రెస్ (Congress) అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఎమ్మెల్సీ (MLC) డాక్టర్ శ్రవణ్ కుమార్ దాసోజు (Dasoju Sravan Kumar) బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో సాగుతున్నది ప్రజాస్వామ్య పాలనా? బూతుల పాలనా? అని మండిప‌డ్డారు. ఢిల్లీలో రాజ్యాంగం.. గల్లీలో రేవంత్ రెడ్డి బూతుల పురాణం..గా మారింద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ సిద్ధాంతాల‌కు.. రేవంత్ చేష్ట‌ల‌కు పొంత‌న లేద‌ని అన్నారు. గాంధేయ విలువ‌ల‌కు తెలంగాణలో ద్రోహం జ‌రుగుతోంద‌ని వాపోయారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలను 'బడవ' (Badwe) అని సంబోధించడంపై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇదేనా మీరు చెప్పిన 'మొహబ్బత్ కీ దుకాణ్'? అని రాహుల్‌కు సూటి ప్ర‌శ్న సంధించారు. సర్పంచులను "తోలు తీస్తా.. పేగులు మెడలో వేసుకుంటా" అని బెదిరించడం అమానుషమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిన్నారుల ముందే మాజీ సీఎంపై అసభ్య పదజాలం వినియోగించ‌డం తెలంగాణ సంస్కృతికి తీరని అవమానమ‌ని అన్నారు. పాలనను 'గల్లీకరణ' చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రేవంత్ స‌ర్కారు అప‌హాస్యం చేస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ మార్క్ పాల‌న అంటే అవినీతి, అరాచకం, అబ్యూసివ్ లాంగ్వేజ్.. ఇవేనా అని ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారంలో రాహుల్‌గాంధీ తక్షణమే జోక్యం చేసుకోకపోతే కాంగ్రెస్ పతనం ఖాయమ‌ని అన్నారు. రాజ్యాంగ నైతికతను తుంగలో తొక్కిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అహంకారానికి అంతం తప్పదని, తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement