Vande Bharat Sleeper | ఆరు నెలల్లో పట్టాలెక్కనున్న ఎనిమిది వందే భారత్ స్లీపర్ రైళ్లు..!
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య దూసుకెళ్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో తొలిసారిగా వందే భారత్ వెర్షన్‌లో స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నది.
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య దూసుకెళ్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో తొలిసారిగా వందే భారత్ వెర్షన్‌లో స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నది. త్వరలోనే గువాహటి - కోల్‌కతా మధ్య రైలు రాకపోకలు పట్టాలెక్కనున్నది. సంక్రాంతి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండాను ఊపి ప్రారంభించనున్నారు. ఇటీవల తొలి వందే భారత్ రైలు ఢిల్లీకి చేరుకోగా.. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రైలును తనిఖీ చేసి.. అందులోని సౌకర్యాలను పరిశీలించారు.
ఇక కేంద్రం రాబోయే ఆరునెలల్లో ఎనిమిది కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 12కి పెంచనున్నది. సుదూర ప్రాంతాలకు రాత్రి సమయంలో ప్రయాణించేలా ఈ స్లీపర్ వెర్షన్‌ను రైల్వేశాఖ తీసుకువస్తున్నది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కేవలం కూర్చునేందుకు మాత్రమే అవకాశం ఉంది. ఈ క్రమంలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకొని స్లీపర్ రైలును నడిపించనున్నట్లు రైల్వే పేర్కొంది. రైలులో ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలు కల్పించింది. త్వరలో ప్రారంభం కానున్న స్లీపర్ రైలులో థర్డ్ ఏసీలో భోజనంతో సహా టికెట్ ధర రూ.2,300, సెకండ్ ఏసీలో రూ.3వేలు, ఫస్ట్ ఏసీలో రూ.3,600 వరకు టికెట్ ధర ఉండనున్నది.
వందే భారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. ఈ ఏసీ రైలులో 823 మంది ప్రయాణీకులు ప్రయాణించేందుకు అవకాశం ఉంది. రైలు పదకొండు కోచ్‌లు థర్డ్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, ఒకటి ఫస్ట్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. థర్డ్ ఏసీలో 611 మంది ప్రయాణికులు, సెకండ్ ఏసీలో 188 మంది, ఫస్ట్ ఏసీలో 24 మంది ప్రయాణీకులు వెళ్లొచ్చు. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌకర్యాలతో పాటు, భద్రత విషయంలోనూ రైల్వే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్, అగ్నిమాపక భద్రతా వ్యవస్థ, ఏఐ ఆధారిత కెమెరాలు అమర్చారు. రైలులో సెన్సార్ ఆధారిత డోర్లు ఉంటాయి. సీట్లు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, పరిశుభ్రత విషయంలోనూ ప్రమాణాలు పాటించేలా సాంకేతికతను వినియోగిస్తున్నది. టెక్నాలజీ సహాయంతో 99.9శాతం హానికారక క్రిములను నాశనం చేస్తుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






