Gold Rate | బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు గుడ్‌న్యూస్!
గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం (Gold Rate), వెండి ధరలు (Silver Price) కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల కాలంలో పుత్తడి, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.
trinethra.news: గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం (Gold Rate), వెండి ధరలు (Silver Price) కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల కాలంలో పుత్తడి, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఆభరణాలు కొనాలంటేనే కొనుగోలు దారులు భయపడిపోతున్నారు. అయితే స్పాట్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం తులం బంగారం రూ.270 తగ్గగా, కిలో వెండిపై రూ.5000 వరకు తగ్గింది.
బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,38,000 వద్ద ట్రేడ్ అవుతున్నది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.250 తగ్గడంతో రూ.1,26,500గా ఉన్నది. దీంతో రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు గ్రాముకు రూ.13,800గా కొనసాగుతున్నది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,650గా పలుకుతున్నది.
లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా రోజురోజుకు పెరుగుతూ పోతున్న వెండి కూడా కాస్త శాంతించింది. కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో రూ.2,52,000గా ట్రేడ్ అవుతున్నది. అయితే హైదరాబాద్‌లో మాత్రం కేజీ స్వచ్ఛమైన వెండి ధర రూ.2,72,000గా ఉంది. అంటే గ్రాము ధర రూ.272 అన్నమాట. చెన్నైలో కూడా ఇదే ధర వద్ద అమ్ముడవుతున్నది. అందువల్ల సంక్రాంతి పండుగకు నగలు కొనాలనుకునే వారు ముందుగా తమ నగరాల్లో ఉన్న ధరలను ఒక్కసారి గమస్తే మంచిది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






