KCR | కేసీఆర్‌ని కలవనున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. అసలేం జరుగుతుంది..?
trinethra.news: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క (Seetakka), కొండా సురేఖ (Konda Surekha) మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) కలువనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో ఇరువురు మంత్రులు భేటీ కానున్నారు.
trinethra.news: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క (Seethakka), కొండా సురేఖ (Konda Surekha) మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) కలువనున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో ఇరువురు మంత్రులు భేటీ కానున్నారు. అయితే మేడారం (Medaram Jatara) పనుల విషయంలో అదే జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై (Ponguleti Srinivas Reddy) మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆగ్రహంగా ఉన్నారని ఇటీవల కాలంలో మీడియాలో తరచూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తమ శాఖల్లో అతిగా కలుగజేసుకుంటున్నారని, అభివృద్ధి నిధుల కేటాయింపు, మేడారం పనులు, కాంట్రాక్టులు, కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి జోక్యం మితిమీరిపోయిందని ఇరువురు మహిళా మంత్రులు గత కొన్ని నెలలుగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కేసీఆర్‌తో భేటీ కానుండటం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
అయితే వీరి సమావేశానికి అసలు కారణం మేడారం జాతర. గిరిజనుల అతిపెద్ద సాంస్కృతిక సంబురం, దేశంలోనే రెండో అతిపెద్ద కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించేందుకే ఇరువురు మంత్రులు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్తున్నారు. ప్రతి రెండేండ్లకు ఒకసారి జరిగే వనదేవతల మహా జాతరను ఈసారి ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా మేడారంలో వేగంగా అభివృద్ధి పనులను పూర్తిచేస్తున్నది. జాతరకు రావాలంటూ విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి మంత్రులు ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భేటీ జరగనుంది.
ఇప్పటికే మంత్రి సీతక్క పలువురు రాజకీయ, సామాజిక వర్గాల నేతలను కలిసి మేడారం జాతరకు ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. అదే క్రమంలో నేడు కేసీఆర్‌ను కలిసి అధికారికంగా మేడారం ఆహ్వాన పత్రికను అందజేయనున్నట్లు తెలిపారు. మేడారం జాతర రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందనే ఉద్దేశంతో అందరినీ ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



