త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harsha Kumar | ప‌థ‌కం ప్రకారం సీనియ‌ర్ల‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపిస్తున్నారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్‌

Harsha Kumar | వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యేపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు జీ. చిన్నారెడ్డిపై (G.Chinna Reddy) కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసిన విష‌యం తెలిసిందే. 40 ఏండ్ల‌కుపైగా పార్టీ కోసం ప‌నిచేసిన వ్య‌క్తిపై అధినాయ‌కత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

G

Telangana | Published On Sep 4, 2026, 11.31 am IST

Harsha Kumar | ప‌థ‌కం ప్రకారం సీనియ‌ర్ల‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపిస్తున్నారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్‌
Advertisement

Harsha Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యేపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు జీ. చిన్నారెడ్డిపై (G.Chinna Reddy) కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసిన విష‌యం తెలిసిందే. 40 ఏండ్ల‌కుపైగా పార్టీ కోసం ప‌నిచేసిన వ్య‌క్తిపై అధినాయ‌కత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత హ‌ర్ష‌కుమార్ (Harsha Kumar) ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ప‌థ‌కం ప్ర‌కారమే అస‌లు కాంగ్రెస్ నేత‌ల‌ను బ‌య‌ట‌కు పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని మండిప‌డ్డారు. అధినాయ‌క‌త్వం జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌క‌పోతే పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు.

`ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ (AP youth congress) అధ్యక్షుడిగా పనిచేసిన జీ. చిన్నారెడ్డి, 1985లో టీడీపీకి (TDP) వ్యతిరేకంగా పార్టీని ముందుండి నడిపించిన ముఖ్య నాయకులలో ఒకరు. 1999లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు, తెలంగాణ (Telangana) ఎమ్మెల్యేల ఫోరమ్‌ను నడిపిస్తూ, ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ప్రణాళికలు రచించిన నాయకుడు ఆయన. 1999లో వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhar Reddy) పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత సమీకరణాల కారణంగా ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. అలాంటి ప‌రిస్థితుల్లోనూ తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరమ్‌ను చిన్నారెడ్డి ముందుండి నడిపించారు.

అయితే, అటువంటి చిన్నారెడ్డిని పక్కనపెట్టి.. గత ప‌దేండ్లుగా బీఆర్ఎస్ (BRS) పార్టీలో ఉండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన‌, కాంగ్రెస్ ద్వారా ఎంపీగా గెలిచి, అధికారం కోల్పోయాక టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఒక నాయకుడి (కే. కేశ‌వరావు) కుమార్తెకు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. వ్య‌క్తిగ‌తంగా చిన్నారెడ్డిని కాదని కేశవరావు కుమార్తెకు అవకాశం ఇవ్వడం సమంజసం కాదనిపిస్తున్న‌ది. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను చూస్తుంటే, ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ సీనియర్లను నెమ్మదిగా బయటకు పంపేలా ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ (congress) అధిష్ఠానం ఈ విషయాలను నిశితంగా గమనించకపోతే, భవిష్యత్తులో పార్టీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.` అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement