త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీ‌న‌గ‌ర్ ఎయిర్‌పోర్టులో ఘ‌ట‌న‌

IndiGo plane hits pole | ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్ర‌మాదం త‌ప్పింది. శుక్ర‌వారం ఉద‌యం న‌వీ ముంబై నుంచి శ్రీ‌న‌గ‌ర్ వెళ్లిన ఇండిగో ఫ్లైట్ 6E 225 అక్క‌డ ల్యాండింగ్ స‌మ‌యంలో విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) స్తంభాన్ని ఢీ కొట్టింది. అదృష్ట‌వ‌శాత్తూ ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేదు.

D

National | Published On Sep 4, 2026, 10.47 am IST

IndiGo plane hits pole | ల్యాండింగ్ వేళ పోల్‌ను ఢీ కొట్టిన విమానం.. శ్రీ‌న‌గ‌ర్ ఎయిర్‌పోర్టులో ఘ‌ట‌న‌
Advertisement

IndiGo plane hits pole | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలో ఘోర విమాన ప్ర‌మాదం త‌ప్పింది. ముంబై నుంచి శ్రీ‌న‌గ‌ర్ వెళ్లిన ఇండిగో విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో పోల్‌ను ఢీ కొట్టింది (IndiGo plane hits pole). అయితే, అదృష్ట‌వ‌శాత్తూ ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేదు. ప్ర‌యాణికులంతా సేఫ్‌గా ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఇండిగో ఫ్లైట్ 6E 225 ఇవాళ ఉద‌యం న‌వీ ముంబై (Navi Mumbai) నుంచి శ్రీ‌న‌గ‌ర్‌కు బ‌య‌ల్దేరింది. ఉద‌యం సుమారు 9:02 గంట‌ల ప్రాంతంలో శ్రీ‌న‌గ‌ర్ ఎయిర్‌పోర్టు (Srinagar airport)లో ల్యాండ్ అయ్యింది. అనంత‌రం ప్లేన్‌ను బే నెం. 06లో పార్క్ చేస్తుండ‌గా ఒక్క‌సారిగా అదుపుత‌ప్పింది. విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) స్తంభాన్ని బ‌లంగా ఢీ కొట్టింది. అయితే, అదృష్ట‌వ‌శాత్తూ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ప్ర‌యాణికులు, సిబ్బంది అంతా సేఫ్‌గా ఉన్నారు.

ఊహించ‌ని ఈ ప్ర‌మాదంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. మ‌రోవైపు మాన్యువ‌ల్ మెట్ల సాయంతో విమానంలోని ప్ర‌యాణికుల‌ను సుర‌క్షితంగా కింద‌కు దింపారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. ఆ స‌మ‌యంలో విమానంలో ఎంత మంది ఉన్నార‌న్న‌దానిపై ఎయిర్‌లైన్స్ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. విచార‌ణ అనంత‌రం ప్ర‌మాదానికి గ‌ల క‌చ్చిత‌మైన కార‌ణాలు తెలుస్తాయ‌ని తెలిపింది.

Also Read..

ముసాయిదా ఓట‌ర్ల‌ జాబితా.. కాంగ్రెస్‌ ఎంపీ పేరు మాయం

నేష‌న‌ల్ ఇన్ఫర్మాటిక్స్ సెంట‌ర్‌లో టెక్నిక‌ల్ అసిస్టెంట్లు..

నింగిలోకి నిఘానేత్రం.. విజ‌య‌వంతంగా జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్ర‌యోగం

Advertisement
Advertisement