SIR | ముసాయిదా ఓటర్ల జాబితా.. కాంగ్రెస్ ఎంపీ పేరు మాయం
SIR | భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వివాదాస్పదమవుతున్నది. ఓటర్ల జాబితాను వంద శాతం తప్పులు లేకుండా ప్రక్షాళన చేయడమే దీని లక్ష్యమని ఈసీ చెప్తున్నప్పటికీ.. డ్రాఫ్ట్ జాబితాల్లో ఏకంగా సిట్టింగ్ ఎంపీల పేర్లే మాయమవుతుండటంతో విమర్శలపలవుతున్నది.
SIR | త్రినేత్ర.న్యూస్: భారత ఎన్నికల సంఘం (ECI) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వివాదాస్పదమవుతున్నది. ఓటర్ల జాబితాను వంద శాతం తప్పులు లేకుండా ప్రక్షాళన చేయడమే దీని లక్ష్యమని ఈసీ చెప్తున్నప్పటికీ.. డ్రాఫ్ట్ జాబితాల్లో ఏకంగా సిట్టింగ్ ఎంపీల పేర్లే మాయమవుతుండటంతో విమర్శలపలవుతున్నది. ఇటీవల పంజాబ్‌లో ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో (Draft Electoral Rolls) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha)పేరును తొలగించడం చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎంపీ (Congress MP) పేరుతో ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా జాబితాలో లేకపోవడం రాజకీయంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నది.
పటియాలా కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ ధరమ్‌వీర గాంధీతోపాటు (Dharamvira Gandhi) ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కనిపించకుండా పోయాయి. తాను 2000 సంవత్సరం నుంచి ప్రస్తుతం ఉంటున్న చిరునామాలోనే ఉంటున్నాని చెప్పారు. ఇక్కడి నుంచే మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశానని, రెండుసార్లు గెలుపొందానని చెప్పారు. ముసాయిదా జాబితాలో తనపేరు లేకపోవడానికి అధికారుల నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపమే కారణమని చెప్పారు. కాగా, పాస్‌పోర్ట్, 10వ తరగతి సర్టిఫికేట్ వంటి పత్రాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించారు. ఆ తర్వాత తప్పును సరిదిద్దిన అధికారులు ఆయన పేరును జాబితాలో చేర్చారు. అయితే, ఆయన భార్య, కుమారుడు, కుమార్తె పేర్లను పునరుద్ధరించబడాల్సి ఉంది. అయితే బీఎల్ఓలు వారికి నోటీసులు జారీచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచీ బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పేరు కనిపించకుండా పోయిన గంటల వ్యవదిలోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రాఘవ్ చద్దా పేరును ‘మరొక ప్రాంతానికి మారినట్లు’ (Shifted) ముసాయిదా జాబితాలో చూపించిన విషయం తెలిసిందే. ఇదికాస్తా పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై రాఘవ్ చద్దా స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగానే తన పేరును తొలగించారని చద్ధా ఆరోపిస్తున్నారు. తాను పంజాబ్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీనని, మొహాలీ పరిధిలో తన ఓటు నమోదై ఉందని స్పష్టం చేశారు. లిస్ట్‌లో తన పేరును షిఫ్ట్ అయినట్లుగా మార్క్ చేయడం చూసి షాక్‌కు గురైనట్లు తెలిపారు. ఇది పొరపాటున జరిగింది కాదని.. రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆయన ఆరోపించారు. తాను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని వీడి బీజేపీలో చేరినందుకే భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు కోసం ఎన్నికల అధికారులను వాడుకుంటోందని నిందించారు.
సంబంధిత వార్తలు

SIR | ఓటరు రికార్డులో వ్యత్యాసాలు.. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సుదర్శన్ రెడ్డికి SIR నోటీసులు
సెప్టెంబర్ 3, 2026

Raghav Chadha | పంజాబ్ ఓటరు జాబితా నుంచి రాఘవ్ చద్ధా పేరు మాయం.. ఆప్ ప్రభుత్వంపై ఆరోపణలు
సెప్టెంబర్ 3, 2026

Jharkhand SIR | జార్ఖండ్‌లో SIR వివాదం.. ఓటర్ల జాబితా నుంచి మైనారిటీల పేర్లు తొలగింపునకు బీజేపీ ఏజెంట్ల ప్రయత్నం
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Stock Markets | 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 23,900 పైన నిఫ్టీ..
- ●Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం
- ●NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్లు..
- ●JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు
- ●ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం
- ●Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?

Stock Markets | 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 23,900 పైన నిఫ్టీ..

Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం

NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో టెక్నికల్ అసిస్టెంట్లు..

JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు



