త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinna Reddy | మెడ ప‌ట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Chinna Reddy | వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.. మెడ ప‌ట్టి బ‌య‌ట‌కు పంపుతానంటే కూడా భ‌రించాన‌ని ప్ర‌ణాళికా సంఘం మాజీ ఉపాధ్య‌క్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేను ఎప్పుడైనా ఇండివిజువ‌ల్.. ప‌ద‌వులు ఉన్నా, లేకున్నా నాకు గౌర‌వం ఉంటుంద‌ని చిన్నారెడ్డి భావోద్వేగానికి లోన‌య్యారు.

S

Telangana | Published On Sep 3, 2026, 8.46 pm IST

Chinna Reddy | మెడ ప‌ట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
Advertisement

నాకు ప‌ద‌వుల‌పై సోకు లేదు..
కానీ ఒక్క పోటుతో కూల్చేశారు
ఈ రోజు దాకా టిల్ ఫ‌ర్ద‌ర్ ఆర్డ‌ర్
ప‌ద‌వి ఉత్త‌ర్వుల‌పై చిన్నారెడ్డి విమ‌ర్శ‌
నేను ఇండివిజువ‌ల్..
ప‌ద‌వులు ఉన్నా, లేకున్నా నాకు గౌర‌వం ఉంటుంది

Chinna Reddy | త్రినేత్ర‌.న్యూస్ : వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.. మెడ ప‌ట్టి బ‌య‌ట‌కు పంపుతానంటే కూడా భ‌రించాన‌ని ప్ర‌ణాళికా సంఘం మాజీ ఉపాధ్య‌క్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేను ఎప్పుడైనా ఇండివిజువ‌ల్.. ప‌ద‌వులు ఉన్నా, లేకున్నా నాకు గౌర‌వం ఉంటుంద‌ని చిన్నారెడ్డి భావోద్వేగానికి లోన‌య్యారు. కాంగ్రెస్ హైక‌మాండ్ నిర్ణ‌యంపై చిన్నారెడ్డి స్పందించారు. త‌న వ్య‌వ‌సాయం పొలం వ‌ద్ద ఓ సాధార‌ణ రైతు మాదిరి కూర్చుని.. త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు.

నాకు పదవులపై ఎలాంటి సోకు లేద‌న్నారు. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, ఒక్క పోటుతో కూల్చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని గుర్తు చేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి కూడా “టిల్ ఫర్థర్ ఆర్డర్” అని ఇచ్చారు. ఈ రోజు దాకా టిల్ ఫ‌ర్ద‌ర్ ఆర్డ‌ర్ అని విమ‌ర్శించారు.

పదవులు లేకున్నా నా గౌరవం నాకు ఉంటుంది, పదవి కోసం రేవంత్ రెడ్డిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. నా మనుషులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్తే మెడ పట్టి బయటకు దొబ్బుతానని మేఘా రెడ్డి అన్నాడు.. అయినా భరించాన‌ని చిన్నారెడ్డి చెప్పుకొచ్చారు.

చిన్నారెడ్డి రాజ‌కీయ జీవితానికి రేవంత్ రెడ్డి సున్నం

నాడు గోడల మీద వనపర్తిలో చిన్నన్న గురించి నినాదాలు రాశానని పలుమార్లు సభల్లో పొగిడిన రేవంత్ రెడ్డి, నేడు ముఖ్యమంత్రి హోదాలో చిన్నారెడ్డి రాజకీయ జీవితానికి సున్నం పెట్టార‌ని ఆయ‌న అభిమానులు మండిప‌డుతున్నారు.

చిన్నారెడ్డిని గెలిపించండ‌ని నాడు రేవంత్ రాత‌లు

వ‌న‌ప‌ర్తి జిల్లా కొత్త‌కోట‌లో ఈ ఏడాది జులై 15న ప్ర‌భుత్వ బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల భ‌వ‌నం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా చిన్నారెడ్డితో త‌న‌కున్న అనుంబంధాన్ని సీఎం రేవంత్ నెమ‌రేసుకున్నారు. త‌న ఇంట‌ర్ విద్య నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్న రేవంత్.. 1984లో జిల్లెల చిన్నారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించండి అని నాడు గోడ‌ల మీద రాసి ప్ర‌చారం చేశాన‌ని తెలిపారు.

1984 ఎన్నిక‌ల సంద‌ర్భంలో నేను ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ఉన్న‌ప్పుడు చిన్నారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. ఆయ‌న‌ను గెలిపించండి అని గోడ‌ల మీద రాసి ప్ర‌చారం చేశాను. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను చిన్న‌చూపు చూస్తే.. ఎమ్మెల్యే జీ మ‌ధుసూద‌న్ రెడ్డి, మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు చిన్నారెడ్డిని చూపించండి. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివితే మంత్రులు, ఇంజినీర్లు, డాక్ట‌ర్లు కావొచ్చు.. ఆపై మాట్లాడితే న‌న్ను చూపించండి సీఎం కావొచ్చ‌ని అని సీఎం విద్యార్థుల‌కు సూచించారు.

Advertisement
Advertisement