త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఇన్వెస్ట‌ర్ల‌కు అల‌ర్ట్‌.. బులియ‌న్ మార్కెట్ల‌లో మిశ్ర‌మ సంకేతాలు..

Gold And Silver Prices Today | ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐటీ షేర్ల‌లో ర్యాలీ చోటు చేసుకోవ‌డంతో ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం మిశ్ర‌మ సంకేతాలు వెలువ‌డుతున్నాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా, దేశీయ మార్కెట్‌లో మాత్రం భారీగా పెరిగాయి.

S

Business | Published On Sep 4, 2026, 11.01 am IST

Gold And Silver Prices Today | ఇన్వెస్ట‌ర్ల‌కు అల‌ర్ట్‌.. బులియ‌న్ మార్కెట్ల‌లో మిశ్ర‌మ సంకేతాలు..
Advertisement

Gold And Silver Prices Today | ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐటీ షేర్ల‌లో ర్యాలీ చోటు చేసుకోవ‌డంతో ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే బులియ‌న్ మార్కెట్ల‌లో మాత్రం మిశ్ర‌మ సంకేతాలు వెలువ‌డుతున్నాయి. అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా, దేశీయ మార్కెట్‌లో మాత్రం భారీగా పెరిగాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర ఈ సెష‌న్‌లో 0.05 శాతం త‌గ్గి 4,471 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 0.46 శాతం త‌గ్గి 66 డాల‌ర్ల‌కు చేరింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 646 పాయింట్లు త‌గ్గి 1,55,130 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 1501 పాయింట్లు ప‌త‌న‌మై 2,40,848 వ‌ద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,666 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,25, 328 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,56,660 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,66,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.13,100 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,360 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,14,880గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,43,600 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,36,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.12,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,749 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.93,992గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,17,490 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,74,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.9,800 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,50,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,55,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,550 గా ఉంది.

Advertisement
Advertisement