Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి
Gadwal Vijayalakshmi | తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా, క్యాబినెట్ మంత్రి హోదాతో బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని, సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
Gadwal Vijayalakshmi | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా, క్యాబినెట్ మంత్రి హోదాతో బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని, సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి,రాష్ట్ర నాయకత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, మంత్రివర్గానికి గద్వాల్ విజయలక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఇంత కీలకమైన బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీకి, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి, అగ్రనేత రాహుల్ గాంధీకి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ కి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
“ నాకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ప్రజల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తాను. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మరింత బాధ్యతగా ముందుకు సాగుతాను” అని గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా తనకు లభించిన ఈ అవకాశం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగించుకుంటానని ఆమె తెలిపారు. తెలంగాణ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు
సంబంధిత వార్తలు

Chanchalguda to Santoshnagar Flyover | పాతబస్తీ ట్రాఫిక్ కష్టాలకు చెక్: చంచల్‌గూడ – సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్
సెప్టెంబర్ 3, 2026

Konda Surekha – Chinna Reddy | సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డి రాజీనామా
సెప్టెంబర్ 3, 2026

KTR | రైతుల కోసం.. కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తా : కేటీఆర్
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●BJP Malka Komaraiah | ఫీజులు అడిగితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు
- ●Konda Surekha - Chinna Reddy | సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డి రాజీనామా
- ●KTR | రైతుల కోసం.. కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తా : కేటీఆర్
- ●Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్
- ●Jajula Srinivas Goud | కాంగ్రెస్‌ను ప్రజలే బర్తరఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్
- ●Konda Murali | మీసం మెలేసిన కొండా మురళీ.. దేనికి సంకేతం..?

BJP Malka Komaraiah | ఫీజులు అడిగితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు

Konda Surekha - Chinna Reddy | సురేఖ బర్తరఫ్.. చిన్నారెడ్డి రాజీనామా

KTR | రైతుల కోసం.. కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తా : కేటీఆర్

Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్



