Charan Kaushik Yadav | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక సోనియా త్యాగాలను మర్చిపోయారా..?
Charan Kaushik Yadav | సోనియా గాంధీ (Sonia Gandhi) ఆత్మకథలో (autobiography) తెలంగాణ (Telangana) ప్రస్తావన లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ (Charan Kaushik Yadav) తీవ్రంగా స్పందించారు. ఆత్మకథలో అక్షరాల కంటే సొంత పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చారిత్రాత్మక నిర్ణయమే ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు.
Charan Kaushik Yadav | త్రినేత్ర న్యూస్ : సోనియా గాంధీ (Sonia Gandhi) ఆత్మకథలో (autobiography) తెలంగాణ (Telangana) ప్రస్తావన లేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ (Charan Kaushik Yadav) తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక సోనియా గాంధీ చేసిన చారిత్రక త్యాగాలను గుర్తు చేస్తూ కేటీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారే కాదని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా కేటీఆర్‌కు రెండుసార్లు మంత్రి పదవితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ వల్లే దక్కాయని గుర్తుచేశారు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో బీఆర్ఎస్‌కు కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండగా, 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదని అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తనకున్న 206 మంది లోక్‌సభ ఎంపీలు, 67-71 మంది రాజ్యసభ సభ్యుల బలంతో పాటు మిత్రపక్షాలను ఒప్పించి తెలంగాణ బిల్లును గట్టెక్కించారని గుర్తు చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో 29, 33 ఎంపీ సీట్లు గెలిచిన కాంగ్రెస్.. తెలంగాణ ఏర్పాటు వల్ల 2014, 2019, 2024 ఎన్నికల్లో ఏపీలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేమని తెలిసినా ఇచ్చిన మాటకు కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. సమైక్య రాష్ట్రంగా ఉంటే 42 సీట్లలో కనీసం 20కి పైగా ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉన్నా, విభజన నిర్ణయంతో 2014లో 44, 2019లో 52 సీట్లకే పరిమితమై జాతీయ స్థాయిలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయే నష్టాన్ని సోనియా గాంధీ భరించారని వివరించారు. ఆత్మకథలో అక్షరాల కంటే సొంత పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చారిత్రాత్మక నిర్ణయమే ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read..
ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా.. 100 పోస్టుల భర్తీ
దివ్యాంగులకు సమాన అవకాశాలు.. అడ్డంకులు లేని సమాజమే వికసిత భారత్ లక్ష్యం..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్
నవంబర్ 20, 2026

SI Prelims | ఈ నెల 29న రాత పరీక్ష.. ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల
నవంబర్ 20, 2026

Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాల తరలింపు.. సర్కిల్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Esther Anil | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా వెంకటేష్ చిన్నకూతురు - తొమ్మిది భాషల్లో రిలీజ్
- ●Samantha | తల్లయిన సమంత - కొడుకు పేరు చెప్పేసింది!
- ●FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..
- ●Cheetah | నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం
- ●Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్
- ●Tollywood | ఇంటివాడుకాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో

Esther Anil | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా వెంకటేష్ చిన్నకూతురు - తొమ్మిది భాషల్లో రిలీజ్

Samantha | తల్లయిన సమంత - కొడుకు పేరు చెప్పేసింది!

FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..

Cheetah | నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం



