Esther Anil | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్‌గా వెంకటేష్ చిన్నకూతురు – తొమ్మిది భాషల్లో రిలీజ్
దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్నకూతురిగా నటించింది ఎస్తేర్ అనిల్. దృశ్యంతో పాటు పలు మలయాళ, తెలుగు, తమిళ సినిమాల్లో చైల్డ్ యాక్టర్‌గా కనిపించిన ఎస్తేర్ అనిల్ తాజాగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్‌లో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేసింది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Nov 20, 2026, 2.56 pm IST
Esther Anil | దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లో హీరో వెంకటేష్ చిన్నకూతురిగా కనిపించింది ఎస్తేర్ అనిల్. చైల్డ్ యాక్టర్‌గా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఎస్తేర్ తాజాగా హీరోయిన్‌గా మారింది. ఓ బాలీవుడ్ సినిమా చేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అనిల్ కపూర్ సోదరుడు...
అన్ఎక్స్‌పెక్టెడ్ సఫేద్ సచ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు , అనిల్ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్తేర్ అనిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్‌తో పాటు ఎస్తేర్ అనిల్‌కు ఇదే తొలి హిందీ మూవీ కావడం గమనార్హం.
వాస్తవ ఘటనలతో....
డెహ్రాడూన్‌లో జరిగిన ఓ క్రైమ్ కేసు ఆధారంగా వాస్తవ ఘటనలతో సఫేద్ సచ్ సినిమా తెరకెక్కుతోంది. ఇంట్లో జరిగిన ఓ గొడవ కారణంగా కుటుంబసభ్యులపై కోపంతో అర్ధరాత్రి ఇళ్లు వదిలిపెట్టిన ఓ యువతికి ఎలాంటి అన్యాయం జరిగింది? ఈ కేసును ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు? అనే అంశాలతో ఈ మూవీ రూపొందుతోంది.
సఫేద్ సచ్ సినిమాను తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో తంబి రామయ్య, పృథ్వీరాజ్, ప్రశాంత్ నారాయణన్ కీలక పాత్రలు పోషించారు.
దృశ్యంతో ఫేమస్...
నల్లవాన్ అనే మలయాళ మూవీతో ఎస్తేర్ అనిల్ తొలిసారి కెమెరా ముందుకొచ్చింది. దృశ్యం సినిమాతో ఫేమస్ అయ్యింది. దృశ్యం తెలుగు, తమిళ రీమేక్‌లలో సేమ్ రోల్ చేసింది. తెలుగులో జోహార్ అనే సినిమాలో చైల్డ్ యాక్టర్‌గా కనిపించింది.
View this post on Instagram
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nifty Bank | బ్యాంకింగ్ షేర్లలో భారీ ర్యాలీ.. సరికొత్త మైలురాయికి చేరిన బ్యాంక్ నిఫ్టీ సూచీ..
- ●Prashanth Reddy | రేవంత్ స్పీచ్‌కు సిద్దిపేట డ్రైనేజీలు పొంగిపొర్లినయట.. నాకు ఫోన్ చేసి చెప్పిర్రు
- ●Samantha | తల్లయిన సమంత - కొడుకు పేరు చెప్పేసింది!
- ●FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..
- ●Cheetah | నాలుగు కూనలకు జన్మనిచ్చిన KOMG 3.. దేశంలో మరింత పెరిగిన చీతాల కుటుంబం
- ●Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా కప్పకపోతే.. నువ్వు పదవులు అనుభవించేవాడివా?.. రేవంత్‌పై రసమయి ఫైర్

Nifty Bank | బ్యాంకింగ్ షేర్లలో భారీ ర్యాలీ.. సరికొత్త మైలురాయికి చేరిన బ్యాంక్ నిఫ్టీ సూచీ..

Prashanth Reddy | రేవంత్ స్పీచ్‌కు సిద్దిపేట డ్రైనేజీలు పొంగిపొర్లినయట.. నాకు ఫోన్ చేసి చెప్పిర్రు

Samantha | తల్లయిన సమంత - కొడుకు పేరు చెప్పేసింది!

FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పంట..





