Tollywood | ఇంటివాడుకాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో శివ కందుకూరి గుడ్‌న్యూస్ వినిపించాడు. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించాడు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహాతో శివ కందుకూరి పెళ్లి డిసెంబర్‌లో జరుగబోతుంది. తెలుగులో చూసీ చూడంగానే, భూతద్ధం భాస్కర్ నారాయణ, మను చరిత్ర సినిమాల్లో హీరోగా నటించాడు శివ కందుకూరి.
Entertainment | Published On Nov 20, 2026, 1.42 pm IST
Tollywood | టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి కబురు వినిపిస్తున్నారు. ఇటీవలే మెగా హీరో సాయిధరమ్‌తేజ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. హనుమాన్ ఫేమ్ తేజా సజ్జా వచ్చే నెలలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. తాజాగా మరో తెలుగు హీరో ఓ ఇంటివాడుకాబోతున్నాడు. శివ కందుకూరి పెళ్లి శిశిర సింహతో డిసెంబర్‌లో జరుగబోతుంది. ఈ గుడ్‌న్యూస్‌ను శివ కందుకూరి అభిమానులతో పంచుకున్నారు. కాబోయే భార్యతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ రింగ్‌లను చూపిస్తూ కనిపిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన శిశిర సింహా ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తోంది. గత కొన్నేళ్లుగా శివ, శిశిర ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెద్దల అంగీకారంతో ఈ జంట వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలిసింది.
చూసీ చూడంగానే...
నిర్మాత రాజ్ కందుకూరి తనయుడిగా శివ కందుకూరి చూసీ చూడంగానే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గమనం, మను చరిత్ర, భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాల్లో హీరోగా నటించాడు. శర్వానంద్ మనమే సినిమాలో ఓ కీలక పాత్రను పోషించాడు. ప్రస్తుతం హీరోగా టాల్కమ్ ఫౌడర్ అనే మూవీ చేస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kayadu Lohar | 12 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై టాలీవుడ్ హీరోయిన్ సాహసం
నవంబర్ 20, 2026

Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ – ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
నవంబర్ 20, 2026

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు – హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Chinna Reddy | రేవంత్‌రెడ్డి అవినీతి లక్ష కోట్లు దాటిపోయింది.. ఆయన ఒక బీజేపీ కోవర్ట్
- ●Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
- ●Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది
- ●Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్
- ●Sridhar Babu | హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
- ●Sreeleela | శ్రీలీలను వదలని బ్యాడ్‌లక్ - సాయిపల్లవి ముందు యాక్టింగ్‌లో తేలిపోయిందంటూ ట్రోల్స్

Chinna Reddy | రేవంత్‌రెడ్డి అవినీతి లక్ష కోట్లు దాటిపోయింది.. ఆయన ఒక బీజేపీ కోవర్ట్

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న

Rekha Naik | రైస్ మిల్ నా పేరు మీదే ఉంది.. అందుకే ఈడీ వచ్చింది

Jabardasth Comedian | యాంకర్‌ను పెళ్లిచేసుకున్న జబర్ధస్థ్ కమెడియన్ - ఏడేళ్ల ప్రేమ అంటూ పోస్ట్



