త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా క‌ప్ప‌క‌పోతే.. నువ్వు ప‌ద‌వులు అనుభ‌వించేవాడివా?.. రేవంత్‌పై ర‌స‌మ‌యి ఫైర్‌

Rasamayi Balakishan | కేసీఆర్ పేరు ఎత్తే అర్హ‌త కూడా రేవంత్ రెడ్డికి (Revanth Reddy) లేద‌ని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ (Rasamayi Balakishan) విమ‌ర్శించారు. సిద్దిపేట‌కు ప్ర‌శ్నించే త‌త్వం ఉంద‌ని, అలాంటి మ‌ట్టిలో పుట్టిన బిడ్డ కేసీఆర్ (KCR) అని చెప్పారు.

G

Telangana | Published On Nov 20, 2026, 1.45 pm IST

Rasamayi Balakishan | కేసీఆర్ గులాబీ కండువా క‌ప్ప‌క‌పోతే.. నువ్వు ప‌ద‌వులు అనుభ‌వించేవాడివా?.. రేవంత్‌పై ర‌స‌మ‌యి ఫైర్‌
Advertisement

Rasamayi Balakishan | త్రినేత్ర న్యూస్‌: కేసీఆర్ పేరు ఎత్తే అర్హ‌త కూడా రేవంత్ రెడ్డికి (Revanth Reddy) లేద‌ని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ (Rasamayi Balakishan) విమ‌ర్శించారు. సిద్దిపేట‌కు ప్ర‌శ్నించే త‌త్వం ఉంద‌ని, అలాంటి మ‌ట్టిలో పుట్టిన బిడ్డ కేసీఆర్ (KCR) అని చెప్పారు. మలిద‌శ‌లో తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన గొప్ప వ్యక్తని తెలిపారు. తెలంగాణ అంటే ద్వేషించే, సిద్దిపేట చరిత్ర తెల్వని మూర్ఖుడి గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంద‌ని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రేవంత్ రెడ్డికి నెత్తిమీద దిమాక్ లేద‌ని, నెత్తుటి భాష మాట్లాడుతార‌ని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ నాయ‌కులు రాంబాబు యాదవ్, రవినాయక్‌తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డారు.

`నివు తెచ్చుకున్న వాళ్లు నీ ముందు చప్పట్లు కొట్టారు. కానీ సభ తర్వాత బూతులు తిట్టారు. కేసీఆర్ నీకు రాజకీయ బిక్ష పెట్టారు. నీ మెడలో గులాబీ కండువా కప్పకపోతే నీవు పదవులు అనుభవించేవాడివా?. పదవుల కోసం ఆశించిన వ్యక్తి కాదు.. పదవులను గడ్డిపోచతో తీసేసిన వ్యక్తి కేసీఆర్. 2001లో తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరిన నాడు నీలాంటి వాళ్లు చాలా మంది హేళన చేశారు. అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని 14 ఏండ్లు కోట్లాది తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్.

తెలంగాణను సర్వనాశనం చేసిందే ఇందిరమ్మ

తెలంగాణను సర్వనాశనం చేసిందే ఇందిరమ్మ. నాడు తెలంగాణ లేదు, ఏం లేదు అన్నది ఇందిరా గాంధీ (Indira Gandhi). 1969లో తెలంగాణ కోసం పోరాటం చేస్తే 369మందిని బలి తీసుకుంది మీ నాయకుడు కాసు బ్రహ్మానందరెడ్డి. అవకాశం వచ్చిన ప్ర‌తిసారీ తెలంగాణ ఆగం చేసింది. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఆత్మహత్య లకు కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్‌కు (Congress) పునర్జన్మ ఇచ్చింది కేసీఆర్. 2004లో కాంగ్రెస్ పొత్తుతో అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేయాలని కుట్రలు చేసింది.

తెలంగాణ వచ్చాడో కేసీఆర్ సచ్చుడో అని సిద్దిపేటలో (Siddipet) దీక్షకు పూనుకున్నాడు. డిసెంబర్ 9న చిదంబరం ప్రకటనకు కట్టుబడి లేకపోవడంతో శ్రీకాంత్ చారి బలిదానం చేసుకున్నాడు. అమరుల పేరు ఎత్తే నైతికత నీకు ఉన్నదా?. శ్రీకాంత చారి తల్లిగా ఆమెకు కేసీఆర్ ఎంత గౌరవం ఇచ్చారో అందరికీ తెలుసు. శంకరమ్మను (Shankaramma) 2014లో అసెంబ్లీకి తీసుకురావాలని కేసీఆర్ ఆలోచన చేస్తే ఓడ‌గొట్టింది మీ కాంగ్రెస్ నాయకుడు. తెలంగాణ అమరుని తల్లి గెలిపించాలని అంటే.. ఆంధ్రా నుంచి డబ్బుల సంచులు తెచ్చి అమరుని తల్లి శంకరమ్మను ఓడగొట్టారు. శంకరమ్మ కుటుంబానికి కేసీఆర్ ఏం చేశాడో శ్రీకాంత చారి తమ్ముడిని అడుగు. ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నవా?.. ఒక్క అమరునికి అయిన నివాళి అర్పించవా?.

సోనియా గాంధీ (Sonia Gandhi) రాసుకున్న ఆత్మకథలో తెలంగాణ ఎక్కడుంది. రాజీవ్ గాంధీతో తొలి ప్రేమ గుర్తుకు ఉన్న సోనియా కు 12వందల మంది చనిపోయిన తెలంగాణ చరిత్ర మాత్రం గుర్తుకు రాలేదు. తెలంగాణ కోసం రాస్తే తెలంగాణ ను మోసం చేసిన విషయం గురించి రాయల్సిన అవసరం ఉంటుంది అని రాయలేదు.

గడ్డం అంటే ఊగిపోతున్నాడు..

కేటీఆర్‌ను గంజాయి బ్యాచ్ అనవచ్చునా? మూడు సార్లు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన వ్యక్తి కేటీఆర్ (KTR). ముఖ్యమంత్రి అనేవాడు అలా మాట్లాడుతాడా?. ఈ మధ్య గడ్డం అంటే ఊగిపోతున్నాడు. ఇటీవ‌ల ఓ ఋషి దగ్గరకు వెళ్తే.. గడ్డంతో నీకు గండం ఉందని చెప్పాడ‌ట‌. అందుకే ఆయన సభలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కను రానివ్వడం లేదు. కేటీఆర్ గడ్డంను చూస్తే ఉద్యమకారుడిలా కనిపిస్తాడు. అదే రేవంత్ రెడ్డి గడ్డం చూస్తే పిచ్చిని లెక్క ఉంటాడు. వందల కోట్ల సభ పెట్టీ గడ్డం గురించి మాటలా.

హరీశ్‌ రావుపై (Harish Rao) మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి సారి అబద్ధాలు పనిచేయవు. అబద్ధాలతో మేము మోసపోయాం అని ప్రజలు ఏడుస్తున్నారు. నీ గండం ఎప్పుడు పోతుందో అని అంటున్నారు. హరీశ్ రావుని తాటి చెట్టు అని అంటాడు. ఆయన మోకాలు అంత మాత్రమే ఉన్నాడు అని నేను అంటే బాగుంటుందా?

ఓటమి ఎరుగని నేత హ‌రీశ్..

ఇప్పటికీ ఓటమి ఎరుగని నేత హ‌రీశ్ రావు. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావ్‌?.. నువ్వు కాంగ్రెస్‌కు కిరాయి దారుడవు. రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా సిద్దిపేట. సిద్దిపేట సభలో 20వేల కుర్చీలు మాత్రమే వేశారు. అందులో 15వేలు మంది కూడా లేరు. సభ ప్రారంభం కాగానే ప్రజలంతా రేవంత్ రెడ్డి ప్రసంగం చూసి బీదరిస్తూ వెళ్లిపోయారు. నీకు ఏం ఉంది.. పేయింటింగ్‌ వేసుకునేవాడివి. హరీశ్‌ రావు తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ముందు నుంచే వాళ్లు ఉన్నోళ్లు. పాల వ్యాపారం చేస్తే నీకు ఏదైనా ఇబ్బందా? నీ గురువు ఒక్కడే పాల వ్యాపారం చేయొచ్చా?.. ఆయ‌న కంపెనీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఆంధ్రోళ్లకు నీ బిడ్డను ఇవ్వచ్చు కానీ.. ఆంధ్రా వాళ్లకు పాలు అమ్మవద్దా?.` అంటూ రేవంత్ రెడ్డిపై ర‌స‌మ‌యి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement