త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | త‌ల్ల‌యిన స‌మంత – కొడుకు పేరు చెప్పేసింది!

హీరోయిన్ స‌మంత త‌ల్ల‌య్యింది. శుక్ర‌వారం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కొడుకు పేరును కూడా రివీల్ చేసింది. త‌న‌యుడికి దేవ్ నిడిమోరు అని నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

N

Entertainment | Published On Nov 20, 2026, 2.05 pm IST

Samantha | త‌ల్ల‌యిన స‌మంత – కొడుకు పేరు చెప్పేసింది!
Advertisement

Samantha |
టాలీవుడ్ హీరోయిన్ స‌మంత త‌ల్ల‌య్యింది. శుక్ర‌వారం పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. తాము త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందిన విష‌యాన్ని రాజ్ నిడిమోరు, స‌మంత స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించారు. త‌న‌యుడికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టిన‌ట్లుగా వెల్ల‌డించారు. త‌న వేలిని చిన్నారి ప‌ట్టుకున్న ఫొటోను స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటో వైర‌ల్ అవుతోంది. సినీ ప్ర‌ముఖుల‌తో పాటు నెటిజ‌న్లు స‌మంత‌, రాజ్ నిడిమోరుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

సీమంతం....

ఇటీవ‌లే అత్త‌గారింట సీమంతం చేసుకుంది స‌మంత‌. మాతృ శిశు మంగ‌ళ ఆశీర్వాదం పేరుతో ఈ వేడుక‌ను నిర్వ‌హించిన‌ట్లు రాజ్ కుటుంబ‌స‌భ్యులు ప్ర‌క‌టించారు.

హీరోయిన్‌గా క‌మ్‌బ్యాక్‌....

2026 స‌మంత‌కు బాగా క‌లిసొచ్చింది. ఈ ఏడాది మా ఇంటి బంగారం సినిమాతో పెద్ద విజ‌యాన్నిఅందుకుంది. వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగులో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతోనే హీరోయిన్‌గా క‌మ్‌బ్యాక్ ఇచ్చింది స‌మంత‌. ఇప్ప‌డు త‌ల్లిగా మారింది.

గ‌త ఏడాది పెళ్లి....

డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరును గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకుంది స‌మంత‌. వీరి వివాహం కోయంబ‌త్తూరులోని ఈషా ఫౌండేష‌న్‌లో నిరాడంబ‌రంగా జ‌రిగింది. పెళ్లికి ముందు రాజ్ నిడిమోరుతో ఫ్యామిలీ మ్యాన్ 2తో పాటు సిటాడెట్ హ‌నీ బ‌న్నీ వెబ్‌సిరీస్‌లు చేసింది స‌మంత‌. ఈ వెబ్‌సిరీస్‌ల షూటింగ్‌లోనే ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లిపీట‌లు ఎక్కారు. కాగా స‌మంత‌, రాజ్ నిడిమోరు ఇద్ద‌రికి ఇది రెండో పెళ్లి కావ‌డం గ‌మ‌నార్హం.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement
Advertisement