త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SI Prelims | ఈ నెల 29న రాత పరీక్ష.. ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుద‌ల

SI Prelims | తెలంగాణ ఎస్ఐ రిక్రూట్‌మెంట్‌కు (SI Exam) స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్థుల‌కు పోలీసు నియామ‌క మండ‌లి (TGLPRB) బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఎస్ఐ ప్రిలిమినరీ (SI Prelims) పరీక్ష హాల్​టికెట్ల‌ను (Hall Tickets) విడుదలచేసింది.

G

Telangana | Published On Nov 20, 2026, 12.33 pm IST

SI Prelims | ఈ నెల 29న రాత పరీక్ష.. ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుద‌ల
Advertisement

SI Prelims | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ ఎస్ఐ రిక్రూట్‌మెంట్‌కు (SI Exam) స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్థుల‌కు పోలీసు నియామ‌క మండ‌లి (TGLPRB) బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఎస్ఐ ప్రిలిమినరీ (SI Prelims) పరీక్ష హాల్​టికెట్ల‌ను (Hall Tickets) విడుదలచేసింది. నవంబర్​ 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి హాల్​ టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 28 అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్‌ www.tgprb.in ద్వారా హాల్ టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్ల‌డించింది. రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు హాల్‌ టికెట్లు భద్రపరచుకోవాలని సూచించింది. ప‌రీక్ష న‌వంబ‌ర్ 29న ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 275 సివిల్ ఎస్ఐ, సమాన స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ (SI Recruitment) విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. మొత్తం 1,60,712 మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు మూడు భాషల్లో అంటే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో పరీక్ష రాయొచ్చు. అత్యధికంగా 56.84 శాతం మంది తెలుగులో రాయడానికి ఎంచుకోగా, 43.02 శాతం మంది ఇంగ్లీష్, 0.12 శాతం మంది ఉర్దూలో రాయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 335 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నుంది. ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా ప‌రీక్ష‌కు అనుమ‌తించేది సేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఎస్ఐ ఖాళీలు ఇలా..

ఎస్ఐ (సివిల్) - 148
ఎస్ఐ (ఆర్మ్​డ్ రిజర్వ్) - 14
ఎస్ఐ (టీజీఎస్పీ) - 12
ఎస్ఐ (ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌) - 3
ఏఎస్ఐ (ఫింగర్ ప్రింట్ బ్యూరో) - 23

అర్హ‌త మార్కుల్లో మార్పులు..

2022 నాటి పోలీస్ రిక్రూట్​మెంట్ నోటిఫికేషన్‌తో పోల్చితే, ఈసారి కనీస అర్హత మార్కుల్లో (Cut off Marks) స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గ‌తంలో అభ్యర్థులందరికీ కనీస అర్హత మార్కుల‌ను 30 శాతంగానే పరిగణించేవారు. అయితే ప్ర‌స్తుతం దానిని కుదించారు. ఈసారి పీడబ్ల్యూటీ (ప్రిలిమినరీ ఎగ్జామ్​ టెస్ట్​)లో అర్హత కోసం ఓసీ, ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) అభ్యర్థులు 30 శాతం మార్కులే సాధించాలి. అంటే మొత్తం 200 మార్కులకు గానూ కనీసం 60 మార్కులు సాధిస్తే అర్హ‌త సాధించిన‌ట్లే. ఇక‌ బీసీ అభ్యర్థులు 25 శాతం (50 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులు, హోంగార్డులు 20 శాతం (40) మార్కులను మాత్రమే అర్హతగా నిర్ణయించారు.

Advertisement
Advertisement