త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో లాభాల పంట‌..

FII Buying | భారత స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) నవంబర్‌లో ఇప్పటివరకు రూ.1.01 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గతంలో భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చిన సందర్భాల్లో నిఫ్టీ 50 గణనీయమైన లాభాలను నమోదు చేసింది. ప్రస్తుత నవంబర్‌లోనూ కేవలం మూడు వారాల్లో నిఫ్టీ 10 శాతం పెరగడం మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

S

Business | Published On Nov 20, 2026, 1.54 pm IST

FII Buying | ఎఫ్ఐఐల కొనుగోళ్లు @ రూ.1 లక్ష కోట్లు.. దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో లాభాల పంట‌..
Advertisement

FII Buying | భారత స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) నవంబర్‌లో ఇప్పటివరకు రూ.1.01 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. గతంలో భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చిన సందర్భాల్లో నిఫ్టీ 50 గణనీయమైన లాభాలను నమోదు చేసింది. ప్రస్తుత నవంబర్‌లోనూ కేవలం మూడు వారాల్లో నిఫ్టీ 10 శాతం పెరగడం మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

రికార్డు స్థాయిలో ఎఫ్ఐఐల కొనుగోళ్లు..

భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ నెల‌లో ఇప్పటివరకు ఎఫ్ఐఐలు రూ.1.01 లక్షల కోట్లకు పైగా విలువైన భారతీయ షేర్లను కొనుగోలు చేశారు. దీంతో గతంలో 2020 నవంబర్‌లో నమోదైన రూ.70,896 కోట్ల రికార్డు కొనుగోళ్లను అధిగమించారు. వరుసగా 14 ట్రేడింగ్ సెషన్ల పాటు విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లు కొనసాగించడం విశేషం. ఏప్రిల్‌-మే 2023 తర్వాత ఇదే సుదీర్ఘ కొనుగోళ్ల పరంపర. అంతకుముందు 2025 జూలై నుంచి 2026 అక్టోబర్ వరకు వరుసగా 16 నెలల పాటు ఎఫ్ఐఐలు భారత మార్కెట్లలో అమ్మకాలు జరిపారు. ఈ కాలంలో మొత్తం రూ.6.32 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో నిఫ్టీ గరిష్ఠ స్థాయిల నుంచి సుమారు 13 శాతం వరకు పడిపోయింది.

విదేశీ పెట్టుబ‌డులు పెరిగేందుకు కార‌ణాలేమిటి..?

విదేశీ పెట్టుబడిదారులు తిరిగి భారత మార్కెట్ల వైపు మళ్లడానికి పలు కారణాలు తోడయ్యాయి. మార్చి గరిష్ఠ స్థాయులతో పోలిస్తే అంతర్జాతీయ ముడి చమురు ధరలు 22 శాతానికి పైగా తగ్గడం, భారత కంపెనీల రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం ప్రధాన కారణాలుగా నిలిచాయి. క్యూ2 ఎఫ్‌వై27లో నిఫ్టీలోని 35 కంపెనీలు మెరుగైన ఫలితాలను ప్రకటించాయి. మరోవైపు అంతర్జాతీయంగా కృత్రిమ మేధ ఆధారిత షేర్లలో పెట్టుబడుల కేటాయింపుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్‌లో దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు దాదాపు 45 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. అమెరికా 10, 30 ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ కూడా అక్టోబర్ గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే 33 బేసిస్ పాయింట్లు తగ్గడం భారత మార్కెట్లకు అనుకూలంగా మారింది.

భారీ లాభాల‌ను అందించిన సూచీలు..

గతంలో విదేశీ పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లు ప్రారంభించిన సందర్భాల్లో నిఫ్టీ 50 మంచి లాభాలను అందించింది. 2020 మేలో ఎఫ్ఐఐల కొనుగోళ్లు పుంజుకున్న తర్వాత మూడు నెలల్లో నిఫ్టీ 23 శాతం పెరిగింది. 2022 ఆగస్టు తర్వాత రెండు నెలల్లో 10 శాతం, 2023 మార్చి తర్వాత నాలుగు నెలల్లో 16 శాతం, 2023 నవంబర్ తర్వాత రెండు నెలల్లో 14 శాతం లాభపడింది. అలాగే 2024 జూన్‌లో విదేశీ పెట్టుబడులు తిరిగి పెరిగిన తర్వాత మూడు నెలల్లో 10 శాతం, 2025 మార్చి తర్వాత నాలుగు నెలల్లో 16 శాతం వృద్ధి నమోదైంది. తాజాగా నవంబర్‌లోనూ ఎఫ్ఐఐల భారీ కొనుగోళ్ల నేపథ్యంలో కేవలం మూడు వారాల్లోనే నిఫ్టీ 50 సుమారు 10 శాతం పెరిగింది. గత గణాంకాలు మార్కెట్‌కు సానుకూల సంకేతాలిస్తున్నప్పటికీ, ఇదే తరహా లాభాలు భవిష్యత్తులోనూ తప్పకుండా వస్తాయని భావించలేమని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి.

Advertisement
Advertisement