Nagarjuna Sagar | నాగార్జున సాగర్ జలాల తరలింపు.. సర్కిల్ ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు
Nagarjuna Sagar | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) నుంచి అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న వ్యవహారంలో నల్లగొండ (Nalgonda) సర్కిల్ ఇంజినీర్లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.
Nagarjuna Sagar | త్రినేత్ర న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) నుంచి అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న వ్యవహారంలో నల్లగొండ (Nalgonda) సర్కిల్ ఇంజినీర్లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే సర్కిల్ ఇంజినీర్లకు (Circle Engineers) షోకాజ్ నోటీసులు (Show Cause Notice) జారీ చేసింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ఈఈ, డీఈ, ఏఈలకు ఈ నిర్లక్ష్యంలో భాగస్వామ్యం లేదా వారిపైనా ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ ఇరిగేషన్ విభాగం ఉన్నతాధికారులు ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు ప్రాంతంలో నీటిని సరఫరా చేసేందుకు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును (Palnadu Water Grid) టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండానే ఏపీ సర్కార్ ప్రాజెక్టును చేపట్టడం, రెండు నెలలుగా రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తుండటంతో బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యం, మొద్దు నిద్ర పోతున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయారంటూ ధ్వజమెత్తింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు సిద్ధమయింది. ఏపీ (Andhra Pradesh) ప్రాజెక్టు గురించి నాగార్జునసాగర్ సర్కిల్ ఇంజినీర్లు ఇరిగేషన్ విభాగానికి, ప్రభుత్వానికి తెలియజేయడంలో విఫలం కావడంతో సర్కారు తీవ్రంగా పరిగణిస్తున్నది. మరోవైపు ఈ అంశంపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను కూడా వివరణ కోరినట్లు తెలుస్తున్నది. దీంతో క్షేత్రస్థాయి పరిణామాలను కలెక్టర్ నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపించారు. ఇరిగేషన్ సీఈ కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్‌ను అందజేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●AI Generated Photo | ఏఐ ఫొటో తెచ్చిన తంటా.. మరో మహిళతో భర్త.. చితకబాదిన భార్య
- ●ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!
- ●Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు
- ●Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..
- ●Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!
- ●Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!

AI Generated Photo | ఏఐ ఫొటో తెచ్చిన తంటా.. మరో మహిళతో భర్త.. చితకబాదిన భార్య

ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!

Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు

Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..






