త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | అసెంబ్లీల నిన్ను బ‌ట్ట‌లిప్పి నిల‌బెడ‌తా

Harish Rao | రేవంత్‌రెడ్డిని ఆధారాల‌తో స‌హా అసెంబ్లీ ముందు బ‌ట్ట‌లిప్పి నిల‌బెడ‌తాన‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) మండిప‌డ్డారు. ఎట్ల ద్రోహం చేస్తున్న‌వో, ఎట్ల క‌రువు తెచ్చిన‌వో బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Nov 20, 2026, 3.39 pm IST

Harish Rao | అసెంబ్లీల నిన్ను బ‌ట్ట‌లిప్పి నిల‌బెడ‌తా
Advertisement
  • నువ్ ఎట్ల ద్రోహం చేసిన‌వో, ఎట్ల క‌రువు తెచ్చిన‌వో బ‌ట్ట‌బ‌య‌లు చేస్తా
  • నీ చేత‌గానిత‌నాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నామనే క‌దా నా మీద నీ క‌సి
  • తొట్టిగ్యాంగుల‌తో టైమ్ వేస్ట్ చేయ‌కు.. సిద్దిపేట‌కు రా.. నువ్వో నేనే తేల్చుకుందాం
  • ముష్టి, కుష్టు, నికృష్ట ప్రయత్నమే నిన్నటి సిద్దిపేట సభ
  • సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జం

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: రేవంత్‌రెడ్డిని ఆధారాల‌తో స‌హా అసెంబ్లీల బ‌ట్ట‌లిప్పి నిల‌బెడ‌తాన‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు (Harish Rao) మండిప‌డ్డారు. ఎట్ల ద్రోహం చేస్తున్న‌వో, ఎట్ల క‌రువు తెచ్చిన‌వో బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ప్రజల ముందు నిన్ను నగ్నంగా నిలబెడుతున్నామని, నీ చేతగాని తనాన్ని బట్టబయలు చేస్తున్నామనే నా మీద క‌సి పెంచుకున్నావ‌న్నారు. ఆ ఫ్రస్టేషన్ అంతా వెల్లగక్కడం కోసం నీకో బహిరంగ సభ కావాల్సి వచ్చిందని ఫైర‌య్యారు. నీ ఫెయిల్యూర్ ఎక్స్ పోజ్ అయిందన్నది నీ ఫ్రస్టేషన్ అని అర్థ‌మైతుంద‌ని విమ‌ర్శించారు. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ సిద్దిపేటలో నిన్న‌టి సీఎం ప్ర‌సంగంపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

అబద్దపు మాటలు, టన్నుల కొద్దీ బూతులు రేవంత్ సిద్దిపేట సభ. 26 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తరలించి పార్టీ ప్లీనరీ పెట్టుకున్నరు. పోలీసు కమిషనరే పార్కింగ్ స్థలాల పేరిట బయటకు వెళ్లడించారు. ముఖ్యమంత్రి ప్రసంగం బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక శాడిస్ట్ మెంటాల్టీ, ఫ్రస్టేషన్ కనిపిస్తున్నది. మూడేళ్ల పరిపాలనలో సర్వ విధాలా వైఫల్యం చెంది, సమస్యల పరిష్కారంలో చేతులెత్తేసి, నీళ్లు ఎత్తిపోయక తెలంగాణను కరువు రక్కసి పాలు చేసి.. ఆంధ్రా నీటి దొంగతనానికి లోపాయికారిగా సహకరించి ఈ మొత్తం భ్రష్టత్వం నుంచి దృష్టి మళ్లించేందుకు చేసిన ముష్టి, కుష్టు, నికృష్ట ప్రయత్నమే నిన్నటి సిద్దిపేట సభ.

కోవ‌ర్టు, స‌బ్ వ‌ర్ట్ అంటే..

నేను చాలా సందర్భాల్లో చెప్పిన కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద రుద్దిన కరువు అని. ఇంకోవైపు నీ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి 20 పర్సెంట్ కమిషన్ గురించి, నీ పాలన సక్కగ లేదని రాజగోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పిండు. నాడు బాబు గారి డబ్బు సంచులతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ.. నేడు బాబు గారి జల దోపిడిలో చేతులు కలిపిన ఇంటి దొంగ.. కోవర్టు, సబ్ వర్ట్, పర్వర్ట్.. ఈ రేవంత్ రెడ్డి. కోవర్టు అంటే.. శత్రవుతో చేతులు కలిపినోడు. సబ్ వర్ట్ అంటే.. వ్యవస్థను భ్రష్టు పట్టించేవాడు. పర్వార్ట్..అంటే వికృత మనస్తత్వం ఉన్నవాడు.

53 సార్లు నా పేరే ఎత్తిన‌వ్‌

నిన్నటి సభలో 63సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు నా పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీసినవు. నాడైనా నేడైనా తెలంగాణకు ద్రోహమే రేవంతు విధానం.. అవినీతి దోపిడీ దాహమే రేవంతుకు ప్రధానం. జుగుప్సాకరమైన కూతలే రేవంతు వికారం. ఆ వైఫల్యాన్ని, ఆ ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిన్నటి సిద్దిపేట సభ పేరిట సర్కస్ ఫీట్లు చేసిండు. సీఎం అంతటి వాడు వస్తే.. తమ నియోజవర్గం అభివృద్ది గురించో, ఇవ్వబోయే నిధుల గురించో మాట్లాడుతడు అని ప్రజలు ఆశిస్తరు. అదేమి లేకపోగా.. ఆద్యాంతం తిట్ల దండకం.

డ్రైనేజీ ఉపన్యాసం కోసం అంత దూరం రావాల్నా?

ఇందిరమ్మ జీవిత బీమా గురించి ఒక్క మాట లేదు. అంత ఫ్రస్టేషన్ నీకు. ప‌త్రికల్లో యాడ్ ఇచ్చినవు, పథకం ప్రారంభిస్తా అన్నవు. ఏమైంది ఒక్క మాట చెప్పలేదు. నా పొడుగు గురించి, కేటీఆర్ గడ్డం గురించి వికృత వ్యాఖ్యలు చేయడం కోసం బోలేడంత ప్రజల సొమ్ము వ్యర్థం చేసి, సిద్దిపేట దాకా రావాలా? ఆ డ్రైనేజీ ఉపన్యాసం కోసం అంతదూరం రావాల్నా? ప్రజల ముందు నిన్ను నగ్నంగా నిలబెడుతున్నామని, నీ చేతగాని తనాన్ని బట్టబయలు చేస్తున్నామనే కదా నీకు నామీద కసి. ఆ ఫ్రస్టేషన్ అంతా వెల్లగక్కడం కోసం నీకో బహిరంగ సభ కావాల్సి వచ్చింది. నీ ఫెయిల్యూర్ ఎక్స్ పోజ్ అయిందన్నది నీ ఫ్రస్టేషన్.

వెయ్యి టీఎంసీల నీళ్లు ఆంధ్రకు వదిలేసి, నువ్వు తెలంగాణకు జల ద్రోహం చేసిన సంగతిని మేం సాక్షాధారాలతో నిరూపించినందుకు, నిలదీస్తున్నందుకు నీకు వశమైతలేదు. కృష్ణా నీళ్లను అక్రమంగా దోపిడీ చేయడం కోసం నాగార్జున సాగర్ కుడివైపు ఏపీ మరో టన్నెల్ అక్రమంగా నిర్మిస్తున్నదనే నిజాన్ని ఈ ముఖ్యమంత్రి దాచి పెట్టిండు. బీఆర్ఎస్, కేటీఆర్, కొన్ని పత్రికలు బయటపెడితే నీకు ఒళ్లు మంట. మేం నిలదీసిన ప్రతిసారీ బ్యాక్ డేట్ వేసి లేఖలు విడుదల చేయడం తప్ప మీకు చిత్తశుద్ది లేదా? ఆనాడు బనకచర్ల అక్రమ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నిలదీస్తే బ్యాక్ డేట్ వేసి లెటర్ విడుదల చేసి చేతులు దులుపుకున్నవు. ఈరోజు సాగర్ టన్నెల్ విషయంలో బ్యాక్ డేట్ వేసిన లెటర్ చూపి తప్పించుకుంటున్నవు.

నాడు కాంగ్రెస్ హయాంలో శ్రీశైలం నుంచి నీళ్లు ఎత్తుకుపోయేందుకు పోతిరెడ్డిపాడు పొక్క కొడితే.. నేటి కాంగ్రెస్ హయాంలో సాగర్ నీళ్లను అక్రమంగా దోచుకునేందుకు టన్నెల్ నిర్మిస్తున్నరు. అప్పుడైనా ఇప్పుడైనా ఏపీ జల దోపిడీకి సహకరించి తెలంగాణకు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీనే. గతంలో అయినా ఇప్పుడైనా.. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే నైజం ఉన్న రేవంత్ వంటి నాయకుల వల్లనే తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతున్నది. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. పాలమూరు జిల్లా నోరు కొట్టి.. పోతిరెడ్డిపాడు పొక్క పెంచి.. కృష్ణా నీళ్లను తరలించింది ఎవరు? నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? పోయిన వారు తిరిగి వచ్చి నిజాలు చెప్పలేరని పచ్చి అబద్దాలు మాట్లాడతావా? పోతిరెడ్డి పాడు విషయంలో పదవులకు ఆశ పడి పెదవులు ముసుకున్నది ఎవరు? మేం ఆ జీవో వచ్చినప్పుడు మీ ప్రభుత్వంలోనే లేము. పెదవులు ముసుకున్నది మీ పక్కన ఉన్న నాయకులే. మేము పోరాటం చేశాం. అసెంబ్లీలో అడ్జర్న్ మోషన్ ఇచ్చాం. స్తంభింపజేశాం.

పదవులను గడ్డి పోచల్లగా వదులుకున్నాం. మేం జూలై 4, 2005 మంత్రి పదవులకు రాజీనామా చేస్తే, 13 సెప్టెంబర్ 2005 జీవో వచ్చింది. మేం రాజీనామా చేసిన మూడు నెలలకు పోతిరెడ్డి పాడు జీవో వచ్చింది. మేం పదవుల్లో ఉన్నపుడు పోతితెడ్డి పాడు నిర్మాణం అయ్యిందని రేవంత్ పచ్చి అబద్దాలు ఎలా మాట్లాడారు? పోతిరెడ్డిపాడు మీద 40 రోజులు అసెంబ్లీ స్తంభింప చేశాం. కావాలంటే రికార్డులు చూసుకో. మాతో ఆరోజు చేతులు కలిపి ఒకే ఒక్క కాంగ్రెస్ నాయకులు పీజేఆర్. పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీది. మేం తెలంగాణ జల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే అప్పుడు రేవంత్ ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నడు.

చరిత్రను వక్రీకరించడం ద్వారా నువ్వు చెప్పే అబద్దాలు, చేసిన మోసాలు లేకుండా పోతాయా? ఇష్టం వచ్చినట్లు వాగి నీ పాపాలు కడుక్కుందామని చూస్తున్నవా? ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే లాగా మాట్లాడుతున్నవు. చనిపోయిన పెద్ద మనిషి నాయిని నర్సింహారెడ్డిని కూడా నీ చిల్లర రాజకీయాలకు వదలవా? కడప ఇంచార్జీగా ఉండి, ఆయన పోతిరెడ్డిపాడుకు సపోర్టు చేసిండని అడ్డగోలుగా మాట్లాడుతవా? కేసీఆర్ ఆదేశం ఇస్తే.. అమెరికాలో ఉండి తెలంగాణ కోసం గవర్నర్ కు రాజీనామా లెటర్ పంపిన అసలు సిసలు తెలంగాణ వాది ఆయన. ఉద్యమ కారుల మీద తుపాకీ ఎక్కు పెట్టిన నువ్వు నాయిని గురించి మాట్లాడుతా? ఇట్ల ఎన్నిరోజులు అబద్దాలు చెప్పుకుంట బతుకుతవు రేవంత్ రెడ్డి?

ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి ఇష్టం ఉన్నట్లు మాట్లాడడానికి సిగ్గులేదా? చెంపలేసుకొని, ముక్కు భూమికి రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పోతిరెడ్డి పాడు పొక్క మొదలైందీ కాంగ్రెస్ పాలనలోనే. మొన్న గోదావరి నీళ్ల దోపిడికి బనకచర్ల ప్రారంభమైంది ఈ కాంగ్రెస్ పాలనలోనే. నేడు సాగర్ కుడి వైపు టన్నెల్ పనులు మొదలు పెట్టింది కాంగ్రెస్ పాలనలోనే. శ్రీశైలంను ఆగం చేసింది కాంగ్రెసే, సాగర్ ను ఆగం చేస్తున్నది కాంగ్రెసే, ఇటు బనకచర్ల పేరుతో గోదావరిని ఆగం చేసింది కాంగ్రెసే.. ఈ దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలు ఆడుతున్నడు రేవంత్ రెడ్డి. చంద్రబాబుకు ఏజెంట్ గా ఉంటూ తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తున్నడు.

కేసీఆర్ గారు ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించారు. చంద్రబాబు పంచన చేరి తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడిచింది నువ్వు కాదా? తెలంగాణ ఉద్యమకారులపై తుపాకులు ఎక్కుపెట్టిన చరిత్ర నీది కాదా? గురుదక్షిణ చెల్లించుకునేందుకు వెయ్యి టీఎంసీల నీళ్లను ఏపీకి వదిలిపెట్టింది నువ్వు కాదా? పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ.. పాలమూరు ప్రాజెక్టులకు నీళ్లు ఎత్తకుండా ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నది నువ్వు కాదా? అసలు కృష్ణా జలాల్లో తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే! 299:512 నిష్పత్తితో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతూ బీఆర్ఎస్‌పై నిందలు వేస్తారా? 299:512 వాటాల విషయంలో మేం సంతకం పెట్టామని నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా. నిరూపించలేకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా రేవంత్ రెడ్డి? 18.10.2013న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలోనే ఈ వాటాల అంశం ఉంది. అదే నివేదికను శాసనసభలోనూ ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, ఆంధ్రప్రదేశ్ పాలకుల ముందు సాగిలపడిన వైఖరి వల్లే తెలంగాణకు 299 టీఎంసీల వాటాతో అన్యాయం జరిగింది నిజం కాదా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం 42 రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని మేం పోరాటం ప్రారంభించాం. కేసీఆర్ గారు ఢిల్లీ వెల్లి ఉమాభారతి గారిని కలిసి రాష్ట్ర హక్కుల కోసం పోరాడారు. కేంద్రం సహకరించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లారు కేసీఆర్. సెక్షన్ 3 కింద పంపినీ చేయాలని ట్రిబ్యులన్ సాధించింది కేసీఆర్. మేం 299కు ఒప్పుకుంటే.. ఎందుకు సెక్షన్ 3 కింద కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఎందుకు కోరాం? అపెక్స్ కౌన్సిల్‌కు ఎందుకు వెళ్లాం? సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాం? ఎందుకు ట్రిబ్యునల్ సాధించాం.
మేమే 299:512 శాశ్వత ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు న్యాయం చేయాలని ఇన్ని పోరాటాలు ఎందుకు చేస్తాం? మూడేళ్ల నుంచి వాదనలు వినిపించి అవార్డు సాధించే తెలివి లేదు. దాని గురించి మాట్లాడటం చేతగాని దద్దమ్మ నువ్వు మా గురించి మాట్లాడుతవా? 299 టెంపరరీ అగ్రిమెంట్. నువ్వు కూడా అదే చేస్తున్నవు. ఆ టెంపరరీ వాటా ప్రకారం కూడా నువ్వు నీళ్లు వాడటం లేదు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ నీళ్లు మీ మూడేళ్ల ప్రభుత్వం వాడింది.

ఎవర్ లోయెస్ట్ యుటిలైజేషన్ ఇన్ హిస్టరీ. కృష్ణా నీళ్లను అతి తక్కువ వినియోగించి తెలంగాణకు మోసం చేసింది ఈ రేవంత్. కరువు సమయంలో లిఫ్టు లేదు పంపు లేదు అంటున్నవు.. దేవాదుల వద్ద 70 టీఎంసీలు నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా ఎత్తలేదు. మోటార్లు నడపక నీళ్లు కిందకు వదిలిపెట్టినవు. దమ్ముంటే ఎన్ని మోటార్లు నడిపినవు, ఎన్ని గంటలు నడిపినవు శ్వేతపత్రం విడుదల చేయి. పాలమూరులో ఎన్ని నీళ్లు ఎత్తినవు. శ్వేతపత్రం విడుదల చేయి. దేవాదుల, కల్వకుర్తి, సీతారామ వద్ద పంపులు లేవా? లేక నీళ్లు లేవా? పంపులు ఉన్నా, నీళ్లు ఎత్తే అవకాశం ఉన్నా నీళ్లు ఎత్తలేదు. నేను గతంలోనే అడిగా.. ఒక్కడూ సప్పుడు చేయలేదు. ఎన్ని నీళ్లు ఎత్తినవు, ఎన్ని నీళ్లు వదిలిపెట్టినవు శ్వేతపత్రం విడుదల చేయి రేవంత్ రెడ్డి.

700 కిలోమీటర్ల కుప్పంకు నీళ్లు ఎలా వెళ్లాయి. పాలమూరుకు ఎందుకు నీళ్లు రావు. ఇది నీ ద్రోహం వల్ల కాదా. నువ్వొక బ్రోకర్, జోకర్. అసెంబ్లీ పెట్టు ఆధారాలతో సహా నగ్నంగా నిలబెడతా. నువ్వు ఎట్ల ద్రోహం చేసినవో, ఎట్ల లేని కరువు తెచ్చినవో బట్టబయలు చేస్తా. అసెంబ్లీ పెట్టు మైక్ కట్ చేయకు నీ ద్రోహ బుద్దిని బయట పెట్టకుంటనే నా పేరు హరీశ్ రావు కాదు. దేవాదుల, సీతారామ, కల్వకుర్తిలో నీళ్లు ఎట్ల లిఫ్ట్ చేయకుండా ద్రోహం చేసినవో చెప్పడానికి నేను సిద్దం నువ్వు సిద్దమా? అసెంబ్లీ పెట్టు. పాలమూరును ఎండబెట్టింది కాంగ్రెస్ పార్టీ పాలమూరు కరువు రాత మార్చాలని కేసీఆర్ పట్టుబట్టారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్. పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్.

చిన్న పని ప్యాకేజీ 3లో పూర్తి చేస్తే పాలమూరు ప్రాజెక్టు ద్వారా 50 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు. కానీ ఆ పని చేయకుండా 50టీఎంసీలు కిందకు వదిలావు. ఎవరు ద్రోహి నువ్వా నేనా? నాడు పంప్ హౌజుల ముందు పడుకొని పని చేసినం. పాలమూరు ఎత్తిపోతల పట్టించుకోలేదు, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ద్వారా నీళ్లు ఇవ్వకపోతివి. పంటలు ఎండిపోయినవి. క్రాప్ హాలిడే మాత్రం ఇచ్చినవు. ఆర్డీఎస్ కింద గతంలో 35 వేల ఎకరాలకు మించి నీళ్లు పారలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తి చేసి.. రాజోలి బండ పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం. కుప్పానికి నీళ్లు తీసుకెళ్లే సోయి అక్కడి ప్రభుత్వానికి ఉంది. మన పాలమూరు ప్రాజెక్టులు నింపే సోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదా? కుప్పానికి నీళ్లు.. పాలమూరుకు కన్నీళ్లు ఎందుకు?

మూడు తరాల పథకాలు కొనసాగిస్తున్నాం అని రేవంత్ పచ్చి అబద్దం చెబుతున్నడు. వైఎస్ ప్రారంభించిన ఫీజు రియింబర్స్ మెంట్ ఎందుకు నిధులు ఇవ్వడం లేదు. మేం 19,500 కోట్లు నిదులు ఇచ్చినం. నువ్వు మూడేళ్లలో 600 కోట్లు కూడా ఇవ్వలేదు. పథకాలు రద్దు చేయలేదు అన్నవు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, ఫీజు రియింబర్స్ మెంట్, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది.

ముత్యంరెడ్డికి రెండు కోట్లు పెట్టి చికిత్స చేయించిన మాన‌వ‌తావాది కేసీఆర్‌

మదన్ మోహన్ గురించి మాట్లాడిండు. నేను సొంత డబ్బులతో నా నియోజకవర్గంలో పెట్టిన.. మీరు ఎవ్వరూ పట్టించుకోలేదు. కేసీఆర్ కట్టిన మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టినవు. నువ్వేమైనా కట్టించినవా? ముత్యం రెడ్డికి క్యాన్సర్ వస్తే రెండు కోట్లు ఖర్చు పెట్టి అమెరికాలో చికిత్స అందించిన గొప్ప మానవతావాది కేసీఆర్. కేసీఆర్ శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి కాదా? నిజంగా ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వు. గెలిపించు. నాడు తెలంగాణ కోసం మేం రాజీనామాలు చేస్తే, నువ్వు జిరాక్స్ కాయితం ఇచ్చి వెన్నుచూపి పారిపోయినవు.

ఉద్యమకారుల మీదకు తుపాకీ ఎక్కుపెట్టి ఉద్యమ ద్రోహిగా మారినవు నువ్వు. రాష్ట్రం వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చంద్రబాబుతో చేయి కలిపిన ద్రోహి నువ్వు. రేవంత్ మాది ఉద్యమాల చరిత్ర అయితే, నీది నిలువెల్లా ద్రోహాల చరిత్ర. నువ్వు చేసిన ద్రోహాలను ఎలా మర్చిపోతుంది తెలంగాణ సమాజం. తొక్కుకుంటూ వచ్చిన అని చెప్పుకునే నిన్ను జనాలు తొక్కే రోజు దగ్గర్లోనే ఉంది రేవంత్. పండవెట్టి తొక్కుతరు. ఓట్లతో తొక్కుతరు. పదేండ్లు ఉంటామని కలలు కంటున్న‌వ్‌. చరిత్రను తనకు ఇష్టం వచ్చినట్లు అన్వయించుకోవడలో రేవంత్ ను మించినోడు లేడు. ఎన్టీఆర్ అధికారం చేపట్టినంక 1989 కాంగ్రెస్ 181 సీట్లతో అధికారంలోకి వచ్చింది.

1994 ఎన్నికల నాటికి 26కు పడిపోయింది. 1994లో ఓడితే అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. ఈసారి మాత్రం నీ చేతగాని పాలన, ఆకాశాన్నంటే అవినీతి, దగుల్బాజీ మాటలు కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏండ్ల వరకు లేవకపోవడం ఖాయం. సిద్దిపేటలో పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి ఆఫర్ చేస్తున్న రేవంత్ రెడ్డి.. వాళ్లో వీళ్లో కాదు నువ్వే వచ్చి సిద్దిపేటల పోటి చేయి. నువ్వో నేనో ప్రజల ముందే తేల్చుకుందాం రా.. ప్రజలు ఎవర్ని ఆదరిస్తరో, ఎవర్ని చీదరిస్తరో తేలిపోతది. తొట్టి గ్యాంగుతో తిట్టించి సమయం వృథా చేసుకోకు.

నీ చరిత్ర ఎవరికి తెలియదు. ముందు ఏబీవీపీ, తర్వాత టిఆర్ఎస్, తర్వాత ఇండిపెండెంట్, తర్వాత టిడిపి, తర్వాత కాంగ్రెస్. టీఆర్ఎస్ లో ఉన్నపుడు నీ బుద్ది తెలిసి నీకు జెడ్పీటీసీ టికెట్ కూడా ఇవ్వలేదు. నువ్వు రేపు ఏ పార్టీలోకి పోతవో నీకే తెలియదు. 25ఏళ్లుగా ఒకే పార్టీ నాది, 25 ఏళ్లలో 5,6సార్లు పార్టీ మారిన చరిత్ర నీది. ఊసరవెళ్లి కూడా నిన్ను చూస్తే సిగుపడుతుంది. సోనియమ్మను బలి దేవత, ఇటలీ బొమ్మ అన్న నువ్వు ఈరోజు కాంగ్రెస్ లో చేరి రాహుల్ గాంధీ, సోనియమ్మ అటెండర్ల కంటే, ప్రియాంక గాంధీ బాడీగార్డ్ కంటే హీనంగా ప్రవర్తిస్తున్నవు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవి పరువు తీస్తున్నవు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నవు. అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ సోనియమ్మను తిడితే దేశంలోనే తొలిసారి ఖండించింది కేసీఆర్. అలాంటి వ్యక్తిపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావా?

అసలు సిద్దిపేటకు వచ్చి నువ్వేం ఇచ్చినవు. మొదటి సారి వచ్చి రుణమాపీ అన్నవు, రెండో సారి వచ్చి రైతు బంధు అన్నవు. 1070 కోట్లు కేసీఆర్ గారు మంజూరు చేసిన నిధులను రద్దు చేసినవు. నేను లేఖ కూడా రాసిన నీకు ఆ పనులు చేస్తే నేనే స్వాగతిస్తా అన్న. మూడోసారి వచ్చి తిట్టిపోయినవు తప్ప చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు. నేను తాడిచెట్టు అయితే నువ్వు గంజాయి చెట్టు. తాడిచెట్టుతో ఎంత ఉపయోగం. గంజాయి చెట్టు సమాజానికి చీడ. నిన్ను, నీ పాలనను జనం చీదరించుకోవడం కాదు, నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చీదరించుకుంటున్నరు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడుపు మండి నిజాలు మాట్లాడితే పిచ్చి కుక్కలు అంటవా? వారు లేకుంటే నీకు సీఎం కుర్చీ ఎక్కడిది? మూడేళ్లలో ఎవరు పిచ్చికుక్కనో ప్రజలకు అర్థమైంది. అధికారం ఉంది కదా అని విర్రవీగకు రేవంత్ రెడ్డి.

బీజేపీని ఎందుకో ప్ర‌శ్నించ‌వ్‌

రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నయి. 25లక్షల ఎకరాల్లో పంట ఎండింది. కేంద్రం సహకరించడం లేదు, కరువు బృందాలు రావడం లేదు. ఏపీకి ఎందుకు వెళ్తాయి తెలంగాణకు ఎందుకు రావు అని బిజేపీని ఎందుకు నిలదీయవు రేవంత్ రెడ్డి. బీబిజేపీని ప్రశ్నించే ధైర్యం నీకు లేదు. నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే మేం పడడానికి సిద్దంగా లేం. నువ్వు సంస్కారంగా ఉంటే మేం ఉంటాం. కర్ణాటక, మహారాష్ట్ర కరువు సాయం చేస్తుంటే నువ్వు ఎందుకు చేయడం లేదు. వడ్లు ఎందుకు కొనడం లేదు, బోనస్ ఎందుకు ఇవ్వడం లేదు. ఒక్క గింజ సన్నవడ్లు కొన్నదా ఈ ప్రభుత్వం. దొడ్డు వడ్లు కొంటున్నరా.. మా లక్ష్యం తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం. మా బాధ్యత సోయికి రాకుంటే ప్రజా పోరాటానికి సిద్దపడతాం లీగల్ గా ఫైట్ చేస్తం. నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది పోరాడుతూనే ఉంటది.

ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సీనియర్ నాయకులు మన్నె గోవర్దన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement