త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Sanjay | నిజాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తుంటే.. కాళేశ్వ‌రంపై అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నారు : ఎమ్మెల్యే సంజ‌య్‌

Kalvakuntla Sanjay | అసెంబ్లీ ప‌నిదినాలు త‌గ్గిపోతున్నాయ‌ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ (Kalvakuntla Sanjay) అన్నారు. నాలుగైదు వారాలు జ‌ర‌గాల్సిన‌ బ‌డ్జెట్ స‌మావేశాలు తొమ్మిది రోజుల‌కు త‌గ్గిన‌ట్లు చెప్పారు.

D

Telangana | Published On Apr 1, 2026, 2.10 pm IST

Kalvakuntla Sanjay | నిజాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తుంటే.. కాళేశ్వ‌రంపై అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నారు : ఎమ్మెల్యే సంజ‌య్‌
Advertisement

Kalvakuntla Sanjay | అసెంబ్లీ ప‌నిదినాలు త‌గ్గిపోతున్నాయ‌ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ (Kalvakuntla Sanjay) అన్నారు. నాలుగైదు వారాలు జ‌ర‌గాల్సిన‌ బ‌డ్జెట్ స‌మావేశాలు తొమ్మిది రోజుల‌కు త‌గ్గిన‌ట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు ఒక్కరైనా సబ్జెక్ట్ మాట్లాడారా..? అని ప్రశ్నించారు. అస‌భ్య‌, బూతు రాజ‌కీయాల‌కే పాల‌క ప‌క్షం ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని మండిప‌డ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే సంజ‌య్ మాట్లాడారు.

స‌హ‌చ‌ర ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని తిట్టేందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త‌మ స‌మ‌యాన్ని వృధా చేసుకున్నార‌ని మండిప‌డ్డారు. అవినీతి మంత్రిని, పార్టీ మారిన వ్యక్తిని వెనుకేసుకొచ్చారని వ్యాఖ్యానించారు. క‌డియం శ్రీ‌హ‌రిని వెనుకేసుకొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయ‌న పార్టీ మార‌డం మీద ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌న్నారు. పొంగులేటి అవినీతిని ప్ర‌శ్నిస్తే క‌డియం శ్రీ‌హ‌రిని అడ్డుపెట్టుకుని రాజ‌కీయం చేస్తున్నార‌న్నారు. "క‌డియం శ్రీ‌హ‌రికి బీఆర్ఎస్ పార్టీ ఏం త‌క్కువ చేసింది..? బీఆర్ఎస్‌లో అన్నీ అనుభ‌వించి ఇప్పుడు కేసీఆర్‌ను త‌ప్పుబ‌డుతుంటే చూస్తూ ఊరుకోవాలా..? మాకు కోపం రాదా..? కచ్చితంగా కడియం శ్రీహరిని నువ్వు ఏ పార్టీలో ఉన్నావని మేం అడుగుతూనే ఉంటాం" అని సంజ‌య్ అన్నారు.

కేసీఆర్‌ను ఉద్దేశించి అస‌భ్య‌క‌రంగా మాట్లాడుతున్నారు..

అసెంబ్లీలో మాట్లాడాల్సిన విష‌యాలు మాట్లాడ‌కుండా అన‌వ‌స‌ర విష‌యాల మీద మాట్లాడితే కొత్త‌గా వ‌చ్చిన ఎమ్మెల్యేలు రాజ‌కీయాల్లో రాణించ‌లేర‌ని ఎమ్మెల్యే సంజ‌య్ అన్నారు. అనేక‌సార్లు చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నికై తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అస‌భ్యక‌రంగా మాట్లాడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. అసెంబ్లీని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బూతుల‌కు అడ్డాగా మార్చారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

హ‌రీష్ రావుపై త‌ప్పుడు విమ‌ర్శ‌లా..?

హ‌రీష్ రావును విప్ ఆది శ్రీనివాస్ బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతున్నార‌ని ఎమ్మెల్యే సంజ‌య్ మండిప‌డ్డారు. ఆయ‌న వేములవాడ గురించి ఎపుడైనా మాట్లాడారా..? అంటూ ప్రశ్నించారు. మ‌ల‌క్ పేట రిజ‌ర్వాయ‌ర్‌లోకి కాళేశ్వ‌రం నీళ్లు వ‌స్తే నీళ్లు చ‌ల్లుకున్న ఆది శ్రీనివాస్.. హ‌రీష్ రావుపై త‌ప్పుడు విమర్శ‌లు చేస్తారా..? అంటూ ప్ర‌శ్నించారు. బీర్ల ఐల‌య్య నియోజ‌క వ‌ర్గానికి కూడా కాళేశ్వ‌రం నీళ్లు వ‌చ్చాయ‌ని అన్నారు. నిజాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తుంటే కాళేశ్వ‌రంపై అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్నారు..? అంటూ ఫైర్ అయ్యారు. హ‌రీష్ రావు ప్ర‌భుత్వ అవినీతిని బ‌య‌ట‌పెడితే.. వాళ్లు మాత్రం ఆయ‌న కుటుంబ‌ స‌భ్యుల‌ను లాగుతున్నార‌ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్ర‌త్య‌ర్థుల కుటుంబ స‌భ్యుల‌ను రాజ‌కీయ వివాదాల్లోకి లాగ‌లేద‌ని వ్యాఖ్యానించారు. హ‌రీష్ రావు నుంచి స‌బ్జెక్టు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటే విప్పుల‌కే మంచిద‌ని సూచించారు.

Also Read..

సీసీటీవీ కెమెరాల అమ్మ‌కాల‌పై క‌ఠిన నిబంధ‌న‌లు తెచ్చిన‌ ప్ర‌భుత్వం.. చైనా కంపెనీల‌కు షాకే

చ‌రిత్ర సృష్టించిన కివీస్ మ‌హిళ‌ల జ‌ట్టు.. వ‌న్డేల్లో రికార్డు స్థాయి ల‌క్ష్య ఛేధ‌న‌..

రాష్ట్రంలో చికెన్ దుకాణాలు బంద్‌.. ఆ కోళ్ల‌కు భారీగా పెరిగిన డిమాండ్‌

Advertisement
Advertisement