Chicken Shops | రాష్ట్రంలో చికెన్ దుకాణాలు బంద్.. ఆ కోళ్లకు భారీగా పెరిగిన డిమాండ్
Chicken Shops | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకణాలు (Chicken Shops) మూతపడ్డాయి. కంపెనీలు కమీషన్లను తగ్గించడానికి నిరసనగా తెలంగాణ చికెన్ సెంటర్ల అసోసియేషన్ బంద్‌కు (Chicken Shops Closed) పిలుపునిచ్చింది.
Chicken Shops | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ దుకణాలు (Chicken Shops) మూతపడ్డాయి. కంపెనీలు కమీషన్లను తగ్గించడానికి నిరసనగా తెలంగాణ చికెన్ సెంటర్ల అసోసియేషన్ బంద్‌కు (Chicken Shops Closed) పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీల యాజమాన్యాల దౌర్జన్యానికి చికెన్ షాపు ఓనర్స్ బలి అవుతున్నారని, లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ అన్యాయానికి నిరసనగా తగ్గించిన మార్జిన్‌ను పెంచే వరకు చికెన్ షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అనేక ప్రాంతాల్లో షాపులు తెరచుకోలేదు. దీంతో నాటుకోళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.
కాగా, బంద్‌పై వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో విక్రేతలు దుకాణాలు తెరవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్బీనగర్లో బంద్‌కు మద్దతుగా ఉన్న అసోసియేషన్ సభ్యులు షాపులు తెరిచిన యజమానులను అడ్డుకున్నారు. అందరూ కలిసి పోరాడితేనే న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. అయితే రోజువారీ వ్యాపారం ఆగిపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు షాపు యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మార్జిన్‌ను రూ. 30కి పెంచాల్సిందే..
గతంలో ఫౌల్ట్రి వాళ్ళు రిటైల్ షాపులకు కేజీకి రూ. 26 మార్జిన్ ఇచ్చే వారని గుర్తు చేశారు. గత 20 ఏండ్లుగా ఇదే మార్జిన్‌ను కొనసాగిస్తున్నారు. అయితే మార్జిన్ పెంచాల్సింది పోయి.. ఇటీవల దానిని రూ.16కు తగ్గించారు. ప్రస్తుతం కేజీ చికెన్‌కు మార్జిన్ రూ.30 చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారిందని దుకానదారులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు జీవనోపాధి కొనసాగించడం సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్జిన్‌ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరసన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోనే 10 వేల షాపులు
ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 8 వేల నుంచి 10 వేల వరకు చికెన్ షాపులు ఉన్నాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పౌల్ట్రీ కంపెనీలు, షాపు యజమానుల మధ్య ఈ ధరల యుద్ధం త్వరగా ముగియకపోతే, మార్కెట్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




