NZW Vs SAW | చరిత్ర సృష్టించిన కివీస్ మహిళల జట్టు.. వన్డేల్లో రికార్డు స్థాయి లక్ష్య ఛేధన..
NZW Vs SAW | బేసిన్ రిజర్వ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 347 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అమీలియా కెర్ అద్భుత ఇన్నింగ్స్‌తో కేవలం రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
NZW Vs SAW | బేసిన్ రిజర్వ్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 347 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ అమీలియా కెర్ అద్భుత ఇన్నింగ్స్‌తో కేవలం రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 50 ఓవర్లలో 346/6 పరుగులు చేసి బలమైన స్కోరు నమోదు చేసింది. అన్నెకె బోష్ 91 పరుగులతో ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసింది. ఆమె 12 బౌండరీలతో ఆకట్టుకుంది. లారా వోల్వార్ట్ 69 పరుగులతో మంచి ఆరంభం అందించగా, సునే లూస్ 40 పరుగులతో స్థిరంగా ఆడింది.
చివరి ఓవర్లలో క్లోయి ట్రయాన్ వేగంగా ఆడుతూ 25 బంతుల్లో 52 పరుగులు చేసి స్కోరును భారీ స్థాయికి చేర్చింది. ఆమె ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో మెరిపించింది. సినాలో జాఫ్తా కూడా 37 పరుగులతో కీలకంగా నిలిచింది. న్యూజిలాండ్ తరఫున బ్రీ ఇల్లింగ్ మూడు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేసింది. కేలీ నైట్ రెండు వికెట్లు దక్కించుకుంది.
అమీలియా కెర్ రికార్డు స్థాయి ఇన్నింగ్స్..
లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే సుజీ బేట్స్ వికెట్ కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే అమీలియా కెర్ అద్భుతంగా ఆడుతూ మ్యాచ్‌ను తలకిందులు చేసింది. ఆమె 139 బంతుల్లో 179 పరుగులు చేసి ఒంటరిగా జట్టును విజయ తీరానికి నడిపించింది. ఈ ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇసబెల్లా గేజ్ 48 బంతుల్లో 68 పరుగులు చేసి కీలక మద్దతు అందించింది. మధ్య మధ్యలో వికెట్లు పడుతున్నా, కెర్ క్రీజులో ఉండటంతో అవసరమైన రన్‌రేట్ నియంత్రణలోనే కొనసాగింది. మ్యాచ్ చివరి దశలో దక్షిణాఫ్రికా తిరిగి పోరాడింది. అయాబోంగా ఖాకా మూడు వికెట్లు, మసాబాటా క్లాస్ రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. చివర్లో కొద్దిపాటి పరుగులు అవసరమైన సమయంలో న్యూజిలాండ్ ధైర్యంగా ఆడి 49.4 ఓవర్లలో 350/8తో విజయాన్ని సాధించింది. జెస్ కెర్ 7 బంతుల్లో 14 పరుగులు చేసి కీలక సమయంలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడింది.
ఈ విజయంతో న్యూజిలాండ్ మహిళల జట్టు సిరీస్‌ను సమం చేసింది. మొదటి వన్డేలో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్ 3న బేసిన్ రిజర్వ్‌లో జరిగే నిర్ణయాత్మక మ్యాచ్‌పై అందరి దృష్టి నిలిచింది. ఈ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.
రికార్డు స్థాయి లక్ష్య ఛేదన..
కాగా ఈ మ్యాచ్‌లో విజయంతో న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళా వన్డేలలో అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా నిలిచింది. అంతకు ముందు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాపై 339 పరుగుల లక్ష్యాన్ని చేధించి టాప్ స్థానంలో నిలిచింది. ఇటీవలే జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఈ రికార్డు చేజ్ చోటు చేసుకుంది. భారత్ 48.3 ఓవర్లలో 341/5 పరుగులు చేసింది. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు 350/8 చేయడంతో భారత్ రికార్డును అధిగమించి టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






