Talasani Srinivas Yadav | ప్రతిపక్షాల అరెస్టు అప్రజాస్వామికం.. రాహుల్ ఎన్నోసార్లు నల్లటీషర్టుతో పార్లమెంట్‌కు వెళ్లారు : తలసాని
Talasani Srinivas Yadav | అసెంబ్లీ సమావేశాలకు రమ్మని చెప్పి.. ప్రతిపక్షాలను గేటు వద్దే అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. మహిళా సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేకనే అక్రమ అరెస్ట్‌లు చేయిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు రమ్మని చెప్పి.. ప్రతిపక్షాలను గేటు వద్దే అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీలోకి (Assembly Session) వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు గేటు వద్దే అడ్డుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తీరుపై తలసాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి తమ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకే నల్ల టీ షర్ట్‌లతో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వచ్చారని తెలిపారు. పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ ఎన్నోసార్లు నల్లటీషర్ట్‌తో వెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాహుల్ నల్ల టీ షర్ట్ వేసుకెళ్ళొచ్చు.. మా సభ్యులు మాత్రం వేసుకోవద్దా..? అంటూ ప్రభుత్వాన్ని తలసాని నిలదీశారు. అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన తాము ప్రజా సమస్యలపై పోరాటాన్నా ఆపబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
రాహుల్‌కో న్యాయం.. మాకో న్యాయమా..?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడం కాంగ్రెస్ ద్వంద నీతికి నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పార్లమెంటుకు రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్ తో వెళ్లొచ్చు .. శాసనసభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల అంగీలతో వెళ్లొద్దా..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి ఒక న్యాయం.. రాష్ట్రంలో ఒక న్యాయమా..? అంటూ రేవంత్ సర్కార్‌ను నిలదీశారు. హామీలు అమలు చేయడం చేతకాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగడం శోచనీయమన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గాయాలు అయ్యాయని చెప్పారు. అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన అణచివేత కాదని.. ప్రజాస్వామ్య విలువలపై, ప్రతిపక్ష హక్కులపై, స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కుపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నల్లచొక్కాలను అడ్డుకోగలరేమో కానీ ప్రజల ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఆపలేదని స్పష్టం చేశారు.
Also Read..
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●EPF | ఈపీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయా.. మొత్తం విత్‌డ్రా చేస్తే నష్టమా..?
- ●Tata Madhu | స్పీకర్‌ను అవమానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు
- ●Minister Jupalli | స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : మంత్రి జూపల్లి
- ●KTR | అడ్డగోలు హామీలతో సబ్బండ వర్గాలను మోసం చేశారు
- ●Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు
- ●Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాలను భాగం చేస్తున్నాం

EPF | ఈపీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయా.. మొత్తం విత్‌డ్రా చేస్తే నష్టమా..?

Tata Madhu | స్పీకర్‌ను అవమానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు

Minister Jupalli | స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : మంత్రి జూపల్లి

KTR | అడ్డగోలు హామీలతో సబ్బండ వర్గాలను మోసం చేశారు





