BRS Protest | అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బీఆర్‌ఎస్ పిలుపు
BRS Protest | అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. తమ ప్రజాప్రతినిధులపై పోలీసులు వ్యవహరించిన తీరును, అక్రమ అరెస్టులను పార్టీ తీవ్రంగా ఖండించింది.
BRS Protest | అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. తమ ప్రజాప్రతినిధులపై పోలీసులు వ్యవహరించిన తీరును, అక్రమ అరెస్టులను పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయా నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి టీషర్టులు ధరించి, కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలన, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ నినాదాలు ముద్రించిన టీషర్టులతో అసెంబ్లీకి వచ్చారు.
అయితే, వారిని పోలీసులు సభా ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల చర్యలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, వీ సునీతా లక్ష్మారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అనంతరం కేటీఆర్, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావుతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు. అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధులను సభలోకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●EPF | ఈపీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయా.. మొత్తం విత్‌డ్రా చేస్తే నష్టమా..?
- ●Tata Madhu | స్పీకర్‌ను అవమానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు
- ●Minister Jupalli | స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : మంత్రి జూపల్లి
- ●KTR | అడ్డగోలు హామీలతో సబ్బండ వర్గాలను మోసం చేశారు
- ●Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు
- ●Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాలను భాగం చేస్తున్నాం

EPF | ఈపీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయా.. మొత్తం విత్‌డ్రా చేస్తే నష్టమా..?

Tata Madhu | స్పీకర్‌ను అవమానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు

Minister Jupalli | స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : మంత్రి జూపల్లి

KTR | అడ్డగోలు హామీలతో సబ్బండ వర్గాలను మోసం చేశారు




