త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Vaddiraju Ravichandra | ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప‌ట్ల పోలీసులు, ప్ర‌భుత్వం వ్య‌వ‌హరించిన తీరుప‌ట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వ‌ద్దిరాజు ర‌విచంద్ర (Vaddiraju Ravichandra) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ వైఖ‌రిని తీవ్రంగా ఖండించారు.

G

Telangana | Published On Sep 7, 2026, 11.16 am IST

Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Advertisement

Vaddiraju Ravichandra | త్రినేత్ర‌.న్యూస్‌: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప‌ట్ల పోలీసులు, ప్ర‌భుత్వం వ్య‌వ‌హరించిన తీరుప‌ట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వ‌ద్దిరాజు ర‌విచంద్ర (Vaddiraju Ravichandra) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ వైఖ‌రిని తీవ్రంగా ఖండించారు. సోమ‌వారం ప్ర‌జాస్వామ్యానికి చీక‌టిరోజ‌న్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షం లేవ‌నెత్తే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక ప్ర‌భుత్వం త‌ప్పించుకుంటున్న‌ద‌ని ఆరోపించారు.

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక, పాలించడం చేతగాక బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎల్పీ డిప్యూటీ లీడర్స్ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా పథకం ప్రకారమే అరెస్టు చేయించాడ‌ని విమ‌ర్శించారు. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడంతో కేటీఆర్, జగదీష్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు గాయాలయ్యాయి. అసెంబ్లీని నడిపించడం చేతగాక రేవంత్ రెడ్డి పలాయనం చిత్తగించాడ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతి ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నార‌ని చెప్పారు. ప్రజాక్షేత్రంలో తగిన శాస్తి తప్పదన్నారు.

Advertisement
Advertisement