త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రి సీతక్క

Minister Seethakka | ఎమ్మెల్సీ తాత మధు (MLC Tata Madhu) సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీత‌క్క డిమాండ్ చేశారు. అంతేకాదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయ‌న్ని కేసీఆర్ స‌స్పెండ్ చేయాలన్నారు.

D

Telangana | Published On Sep 7, 2026, 12.50 pm IST

Minister Seethakka | ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వం రద్దు చేయాలి: మంత్రి సీతక్క
Advertisement

Minister Seethakka | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల తీరుపై మంత్రి సీతక్క (minister seethakka) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమ‌య్యార‌ని విమ‌ర్శించారు. ఎల్పీ మీటింగ్‌లు కూడా అక్క‌డే నిర్వ‌హించ‌డం ఏంట‌ని ప్రశ్నించారు. సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా బీఆర్ఎస్ నేత‌లు రాజకీయ రాద్ధాంతం చేస్తూ నిరసనలు తెలుపుతున్నార‌ని మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించడం చేతకాక, మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక అసెంబ్లీ బ‌య‌ట డ్రామాలు చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

స్పీకర్‌పై తాత మధు (MLC Tata Madhu) చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీత‌క్క తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న స‌భ్య‌త్వం ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న ఒక దళిత వ‌క్తిని ఉద్దేశించి తాతా మ‌ధు మాట్లాడిన మాట‌లు స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న్ని కేసీఆర్ వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని, మండలిలో తాత మధు సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వ్య‌క్తిని వెనకేసుకుని రావడానికి కేటిఆర్, హరీష్‌రావుకి బుద్ధి జ్ఞానం ఉండాలంటూ ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌ని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని సీత‌క్క మండిప‌డ్డారు. ఏ మాత్రం ఆడవారి పట్ల, దళిత జాతి పట్ల గౌరవం ఉన్న తాత మధును బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాల‌ని సీత‌క్క డిమాండ్ చేశారు. ఇదే త‌మ ప్ర‌ధాన డిమాండ్ అని చెప్పారు.

Also Read..

స్పీక‌ర్‌ను అవ‌మానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు

తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు

అస‌లు ఈ ప్ర‌భుత్వానికి ఆర్టీసీ విలీనంపై ఇంట్రెస్ట్ ఉందా?: తీన్మార్ మ‌ల్ల‌న్న‌

Advertisement
Advertisement