త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tata Madhu | స్పీక‌ర్‌ను అవ‌మానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు

Tata Madhu | తాను స్పీకర్‌, చైర్మ‌న్‌ల‌ను దూషించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) తెలిపారు. నేను దురుసుగా మాట్లాడింది నిజమేన‌ని, కానీ తన గొంతు నొక్కేందుకు పోలీసులు ప్రయత్నం చేశారని, దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశానని వివరించారు.

G

Telangana | Published On Sep 7, 2026, 12.48 pm IST

Tata Madhu | స్పీక‌ర్‌ను అవ‌మానించలే.. దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశా: ఎమ్మెల్సీ తాతా మధు
Advertisement

Tata Madhu | త్రినేత్ర‌.న్యూస్‌: తాను స్పీకర్‌, చైర్మ‌న్‌ల‌ను దూషించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) తెలిపారు. నేను దురుసుగా మాట్లాడింది నిజమేన‌ని, కానీ తన గొంతు నొక్కేందుకు పోలీసులు ప్రయత్నం చేశారని, దౌర్జన్యం చేసిన అధికారులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశానని వివరించారు. స్పీకర్ (Assembly Speaker), మండలి చైర్మన్‌పై అపార గౌరవం ఉందన్నారు. కాంగ్రెస్ (Congress) నేతలు ఏ డిమాండ్ చేసినా భయపడనన్నారు. నేను పోలీసులతో మాట్లాడిన మాటలను వక్రీకరించి, స్పీకర్, చైర్మన్‌లను అవమానించినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వెల్ల‌డించారు.

మ‌రోవైపు స్పీకర్‌పై తాతామధు వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు. బీఆర్‌ఎస్‌కు దళితలు అంటే చిన్నచూపని, స్పీకర్‌ను దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తాతామధుపై చర్యలు తీసుకోవాలని, దళితుడైన స్పీకర్‌ను సర్ అనాల్సి వస్తుందనే కేసీఆర్‌ (KCR) అసెంబ్లీకి రావట్లేదని అన్నారు. స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌ను సభ్యులందరూ పాటించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు క్షమాపణలు చెప్పాలన్నారు. తాతామధు వ్యాఖ్యల నేపథ్యంలో ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement