KTR | అడ్డగోలు హామీలతో సబ్బండ వర్గాలను మోసం చేశారు
KTR | అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సబ్బండ వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని 420 హామీలపై బాండ్ పేపర్స్ రాసిచ్చారన్నారు. నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని డిమాండ్ చేశారు.
- హామీలపై బాండ్ పేపర్స్ రాసిచ్చారు.. కానీ ఒక్కటీ అమలు కాలే
- నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలి
- అన్ని వర్గాల సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలి
- గన్‌పార్క్ వద్ద మీడియాతో కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్: అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సబ్బండ వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని 420 హామీలపై బాండ్ పేపర్స్ రాసిచ్చారన్నారు. నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అన్ని వర్గాల సమస్యలపై కూలంకషంగా చర్చ జరగాలన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు గన్‌పార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా ఇప్పటిదాకా ఒక హామీలు నెరవేర్చలేదు. అందుకే ఈరోజు శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్‌ను ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా సభలో అవమానించినా.. ప్రజల కోసం హామీల అమలును ప్రశ్నించండి అని సూచించారు. మా పార్టీపైన కాంగ్రెస్, బీజేపీ కుట్రలు కొత్త కాదు గతంలో ఎన్నో చూశాం. రాష్ట్రంలోని ప్రజలందరి తరఫున కాంగ్రెస్‌ను ఈ సమావేశాల్లో పలు ప్రశ్నలు అడుగుతాం. హామీల అమలు ఏమైంది అని వారందరి తరఫున అడుగుతాం.
జీవో 97 రియల్ ఎస్టేట్ కోసం తీసుకువచ్చారు. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 18 వేల కోట్ల రూపాయల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు ఎందుకు పేరుకుపోయాయని ప్రశ్నిస్తాం. ఎన్నికల ముందు అభయహస్తం ఎన్నికల తర్వాత బస్మాసుర హస్తం అయింది. రాష్ట్రంలోని రైతన్నల తరఫున రైతాంగ సమస్యలపైన ప్రశిస్తాం.
ప్రభుత్వాన్ని ప్రజలు నిషేధిస్తారు..
సింగరేణి కార్మికుల తరఫున, ఆటో డ్రైవర్ల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. నెల రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపైన కూలంకషంగా చర్చ జరగాలి. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు, లైసెన్స్డ్ సర్వేయర్లపై చర్చ జరగాలి. 22A ద్వారా ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిషేధిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రుల బంధువులకు అక్రమ భూ కేటాయింపులు చేస్తున్నారు. తనను ఎన్ని అవమానాలకు గురి చేసినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి అని కేసీఆర్ పిలుపునిచ్చారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు
సెప్టెంబర్ 7, 2026

Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాలను భాగం చేస్తున్నాం
సెప్టెంబర్ 7, 2026

Sabitha Indra Reddy | అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు.. VIDEO
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు
- ●Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాలను భాగం చేస్తున్నాం
- ●Teenmar Mallanna | అసలు ఈ ప్రభుత్వానికి ఆర్టీసీ విలీనంపై ఇంట్రెస్ట్ ఉందా?: తీన్మార్ మల్లన్న
- ●Gadwal Vijayalakshmi | స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
- ●Reliance Jio | రూ.3,599కే జియో యానివర్సరీ ప్లాన్.. 18 నెలల ఏఐ సబ్స్క్రిప్షన్ కూడా..
- ●DCP Shilpavalli | టీ షర్ట్స్ తేసేసి.. బనియన్స్‌పై అసెంబ్లీలోకి వెళ్తామన్నారు.. మేం మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించలే: డీసీపీ శిల్పవల్లి

Telangana Assembly | తెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలు

Ponnam Prabhakar | ఆర్టీసీ విలీన ప్రక్రియ జరుగుతుంది.. అందులో గుర్తింపు సంఘాలను భాగం చేస్తున్నాం

Teenmar Mallanna | అసలు ఈ ప్రభుత్వానికి ఆర్టీసీ విలీనంపై ఇంట్రెస్ట్ ఉందా?: తీన్మార్ మల్లన్న

Gadwal Vijayalakshmi | స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్ పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ



