BRS | అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
BRS | బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీలోకి (Assembly Session) వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు.
BRS | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసగా నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీలోకి (Assembly Session) వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీ షర్టులు ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లోపలికి వెళ్లకుండా ప్రధాన గేటు వద్దే అపివేశారు. పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నొలకొన్నది. టీషర్ట్ తీసేసి బనియన్‌పైనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్ రావు, ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.



ఈ సందర్భంగా అసెంబ్లీకి రండి అంటారు.. మళ్లీ అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ వాళ్లు భయపడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేతులు పట్టుకొని లాగారు, కింద పడేసి తొక్కారని, వారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని, చర్యలు తీసుకోవాలని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యేలని కూడా చూడకుండా పోలీసులు ఇలా ప్రవర్తించడమేంటని ఆమె కంటతడి పెట్టారు. కాగా, అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్‌కు (Telangana Bhavan) చేరుకుంటున్నారు.

నిరసనలకు పిలుపు..
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త నిరసరనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. పార్టీ నాయకులు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయాలని ప్రకటించింది.
సంబంధిత వార్తలు

BRS | అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు
సెప్టెంబర్ 7, 2026

Assembly Session | అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు..
సెప్టెంబర్ 7, 2026

KTR | ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా మోసం: కేటీఆర్
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?
- ●BRS | అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు
- ●Stock Markets | పశ్చిమ ఆసియాలో టెన్షన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Assembly Session | అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు..
- ●KTR | ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా మోసం: కేటీఆర్
- ●Bhatti Vikramarka | ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన.. పాల్గొన్న భట్టి విక్రమార్క

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?

BRS | అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు

Stock Markets | పశ్చిమ ఆసియాలో టెన్షన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Assembly Session | అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు..



