CM Vijay | మహిళలను కించపరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.. ఉదయనిధి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
CM Vijay | ప్రముఖ నటి త్రిష (actor Trisha)ను ఉద్దేశిస్తూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై సీఎం విజయ్ (CM Vijay) తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడితే చట్టం తనపనితాను చేసుకుపోతుందని హెచ్చరించారు.
CM Vijay | త్రినేత్ర.న్యూస్ : మహిళలను కించపరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) హెచ్చరించారు. ప్రముఖ నటి త్రిషను (actor Trisha) ఉద్దేశిస్తూ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇవాళ ఉదయం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. భావప్రకటనా స్వేచ్ఛను ఏ విధంగా ఉపయోగిస్తున్నామనే దానిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజలను ముఖ్యంగా మహిళలను కించరిచేలా మాట్లాడకూడదని సూచించారు. కొందరు మాట్లాడుతున్న డబుల్ మీనింగ్ మాటలను ప్రజలు గమనిస్తున్నారంటూ ఉదయనిధి పేరును ప్రస్తావించకుండానే సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. "కొందరు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మన ఇంట్లో తల్లి, చెల్లి, అక్క ఉన్నారని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. మహిళలను అవమానిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు" అని ఆయన హెచ్చరించారు.
పోలీసు వ్యవస్థ కేవలం నేరస్థులను అరెస్టు చేయడానికి మాత్రమే కాదు..
రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతల పరిరక్షణ ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా సీఎం విజయ్ తెలిపారు. పోలీసు వ్యవస్థను కేవలం నిందితులను అరెస్టు చేసే సంస్థగా మాత్రమే చూడకూడదని పేర్కొన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పోలీసు వ్యవస్థ కేవలం నేరస్థులను అరెస్టు చేయడానికి మాత్రమే కాకుండా.. రాష్ట్రాభివృద్ధికి కూడా పునాది వంటిదని తెలిపారు. చట్టాలను పాటించే వారికి పోలీసులు మిత్రులుగా, పాటించని వారికి శత్రువులుగా ఉంటారని చెప్పారు. పోలీసు వ్యవహారాల్లో రాజకీయ నాయకులు, అధికారుల జోక్యం ఉండకూడదన్నారు. "ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా లేదా ఇతర అధికారి ఎవరైనా సరే.. పోలీసు వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు" అని విజయ్ స్పష్టం చేశారు.
త్రిషపై ఉదయనిధి డబుల్ మీనింగ్ కామెంట్స్
కావేరీ జలాల వివాదం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ అంశంపై (Cauvery protest) గత నెల తంజావూరులో జరిగిన నిరసన ర్యాలీలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌పై విమర్శలు గుప్పించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో టీవీకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఆ సమయంలో నటి త్రిష (actor Trisha)ను ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో డీఎంకే కార్యకర్తలు త్రిష ప్రస్తావన తెచ్చారు. త్రిష, త్రిష అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని నిలువరించాల్సిన ఉదయనిధి నవ్వుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఉదయనిధి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. టీవీకే నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
Also Read..
కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
సంబంధిత వార్తలు

Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!
సెప్టెంబర్ 5, 2026

Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
సెప్టెంబర్ 5, 2026

CM Vijay | చెన్నైలో మెగా ఒలింపిక్ సిటీ, ఫార్ములా-1 రేసింగ్.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?
- ●BRS | అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు
- ●BRS | అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు
- ●Stock Markets | పశ్చిమ ఆసియాలో టెన్షన్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Assembly Session | అసెంబ్లీ సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్.. మాజీ స్పీకర్ శ్రీపాదరావు పేరు..

Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిని నిశితంగా గమనిస్తున్న ప్రజలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి సమయం..?

BRS | అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

BRS | అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులు



