త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MIM MLAs | వందేమాత‌రం ఆల‌పిస్తుండ‌గా వాకౌట్‌.. ఎంఐఎం ఎమ్మెల్యేల శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి : బీజేపీ

MIM MLAs | తెలంగాణ శాస‌న‌స‌భ‌లో జాతీయ గీతం 'వందేమాతరం' (Vande Mataram ) ఆలాపన జరుగుతుండగా వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేల (MIM MLA) శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్ రావు (N. Ramchander Rao) డిమాండ్ చేశారు.

D

Telangana | Published On Mar 25, 2026, 1.55 pm IST

MIM MLAs | వందేమాత‌రం ఆల‌పిస్తుండ‌గా వాకౌట్‌.. ఎంఐఎం ఎమ్మెల్యేల శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలి : బీజేపీ
Advertisement

MIM MLAs | తెలంగాణ శాస‌న‌స‌భ‌లో జాతీయ గీతం 'వందేమాతరం' (Vande Mataram ) ఆలాపన జరుగుతుండగా వాకౌట్ చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేల (MIM MLA) శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్ రాంచంద‌ర్ రావు (N. Ramchander Rao) డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందం రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ్ ప్ర‌తాప్ శుక్లాకు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించింది.

ఈ సంద‌ర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిగా నిలిచిన వందేమాత‌రం గీతాన్ని ఆల‌పిస్తున్న‌ప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు వెళ్ల‌డం అంటే దేశాన్ని, జాతీయ గీతాన్ని, రాజ్యాంగాన్ని అవ‌మానించ‌డ‌మే అని అన్నారు. మ‌జ్లిస్ నాయ‌కుల‌కు ‘‘భారత్ మాతా కీ జై’’ అనడం రాదు, ‘‘జై హింద్’’ అనడం రాదు కానీ, ‘‘జై పాలస్తీనా’’ అన‌డం మాత్రం వ‌చ్చు అంటూ ఎద్దేవా చేశారు. వందేమాత‌రం గీతాలాప‌న స‌మ‌యంలో స‌భ నుంచి వాకౌట్ చేయ‌డం అంటే కేవ‌లం స‌భా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించడం మాత్ర‌మే కాద‌ని, జాతీయ గీతానికి, దేశానికి జ‌రిగిన తీర‌ని అవ‌మానంగా భావించాల‌ని అన్నారు.

రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వుల్లో ఉండి, జాతీయ చిహ్నాల ప‌ట్ల క‌నీస గౌర‌వం లేని ఎంఐఎం స‌భ్యుల తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇది వారి సంకుచిత మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టింద‌ని విమ‌ర్శించారు. సభ గౌరవాన్ని, జాతీయ గీత ప్రతిష్టను దిగజార్చిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ గౌరవం కంటే ఏ రాజకీయ పార్టీ లేదా మతం ముఖ్యం కాదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడమే ఏకైక మార్గమని రాంచందర్ రావు అన్నారు.

Also Read..

ఏపీ నుంచి త‌క్ష‌ణ‌మే తెలంగాణ‌కు రూ.1,270 కోట్లు బ‌దిలీ చేయించాలి: చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి

ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ వ్య‌వ‌ధిని 35 రోజుల‌కు పెంచారంటూ వార్త‌లు.. కేంద్రం క్లారిటీ

ఈసారైనా ఇందిర‌మ్మ ఇండ్ల‌పై సమీక్ష నిర్వ‌హించండి.. మంత్రి పొంగులేటిపై స్పీక‌ర్ ఆగ్ర‌హం

Advertisement

తాజావార్తలు

Advertisement