Nizamabad | చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి
Nizamabad | నిజామాబాద్ (Nizamabad) జిల్లా నవీపేట్ (Navipet) మండలం జన్నేపల్లి (Jannepally) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ అనే యువకుడు వాగులో దూకిన తన చెల్లిని కాపాడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
Nizamabad | త్రినేత్ర.న్యూస్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాగులో దూకి అన్నాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నవీపేట్ (Navipet) మండలం జన్నేపల్లి (Jannepally) గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గణేష్ (26).. తన చెల్లి లయ (22) వాగువైపు వెళ్తుందని తెలుసుకుని ఆమెను అనుసరించాడు. అతను వెళ్లే సరికి లయ వాగులోకి దూకేసింది. తన చెల్లిని కాపాడుకునేందుకు గణేష్ సైతం వాగులోకి దూకాడు. దురదృష్టవశాత్తూ వాగులో నీటి ఉధృతికి ఇద్దరూ మునిగిపోయారు. స్థానికులు చూస్తుండగానే అన్నాచెల్లెళ్లిద్దరూ నీటిలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. గణేష్, లయ కోసం వాగు మొత్తం జల్లెడ పట్టించారు. ఈ క్రమంలో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. గణేష్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. లయ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నట్లు సమాచారం. ఆమె వాగులోకి దూకడానికి గల కారణాలు తెలియరాలేదు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
ఫెడ్ రేట్ పెంపుతోనూ లాభాల్లో భారత మార్కెట్లు.. నిఫ్టీ 23,300 పైన..
సంబంధిత వార్తలు

Navpancham Rajyogam | నేడు నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు, పెండింగ్ పనులకు మోక్షం..!
సెప్టెంబర్ 17, 2026

Dasoju | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్రవణ్ విమర్శలు.. అప్పులు, వడ్డీలు, పెన్షన్ల భారంపై ఆందోళన..!
సెప్టెంబర్ 16, 2026

Nidhhi Agerwal | అందాల నిధి అగర్వాల్.. సారీలో మెరిసిపోయిందిగా..!
సెప్టెంబర్ 16, 2026
తాజావార్తలు
- ●Pop King | హైదరాబాద్‌లో పాప్‌కార్న్‌కు కొత్త క్రేజ్.. 17 రకాల రుచులతో అదరగొడుతున్న పాప్ కింగ్..
- ●Disha Salian | దిశా శాలియన్ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు
- ●MLA Ramachandru Naik | డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి తప్పిన ప్రమాదం
- ●Chiranjeevi | చిరంజీవి కాకాలో మరో హీరోయిన్ - ఫస్ట్ టైమ్ కోలీవుడ్ బ్యూటీతో మెగాస్టార్ రొమాన్స్
- ●Sangareddy | ఆరుగురు విద్యార్థులు మృతి.. హాస్టల్ వార్డెన్ అరెస్ట్
- ●Russia sanctions bill | రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భారత్ ఏమన్నదంటే..?

Pop King | హైదరాబాద్‌లో పాప్‌కార్న్‌కు కొత్త క్రేజ్.. 17 రకాల రుచులతో అదరగొడుతున్న పాప్ కింగ్..

Disha Salian | దిశా శాలియన్ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్ నోటీసు

MLA Ramachandru Naik | డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కి తప్పిన ప్రమాదం

Chiranjeevi | చిరంజీవి కాకాలో మరో హీరోయిన్ - ఫస్ట్ టైమ్ కోలీవుడ్ బ్యూటీతో మెగాస్టార్ రొమాన్స్



