త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | పెళ్లి సామాన్లు తీసుకొస్తూ.. మృత్యుఒడిలోకి తండ్రీకుమార్తె

Hyderabad | వారం రోజుల్లో పెళ్లి.. అంత‌లోనే మృత్యుఒడిలోకి చేరిపోయారు తండ్రీకుమార్తె. పెళ్లి సామాన్లు తీసుకుని ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా మైలార్‌దేవ్‌ప‌ల్లిలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.

S

Hyderabad | Published On Sep 17, 2026, 10.30 am IST

Hyderabad | పెళ్లి సామాన్లు తీసుకొస్తూ.. మృత్యుఒడిలోకి తండ్రీకుమార్తె
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : వారం రోజుల్లో పెళ్లి.. అంత‌లోనే మృత్యుఒడిలోకి చేరిపోయారు తండ్రీకుమార్తె. పెళ్లి సామాన్లు తీసుకుని ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా మైలార్‌దేవ్‌ప‌ల్లిలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హైద‌రాబాద్ అత్తాపూర్‌కు చెందిన ఇస్మాయిల్(48) త‌న కుమార్తె బుష్రా బేగం(21) పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు. మ‌రో వారం రోజుల్లోనే పెళ్లి. అయితే పెళ్లి సామాన్లు తీసుకొని ఇంటికి తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో కాటేదాన్ రోడ్డులో వారి బైక్‌ను టిప్ప‌ర్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే తండ్రీకుమార్తె చ‌నిపోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. టిప్ప‌ర్ అతివేగంగా దూసుకురావ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స్థానికులు తెలిపారు.

Advertisement
Advertisement