త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navpancham Rajyogam | నేడు నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు, పెండింగ్ ప‌నుల‌కు మోక్షం..!

Navpancham Rajyogam | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, వాటి కలయికల ఆధారంగా వివిధ యోగాలు ఏర్ప‌డుతుంటాయి. ఈ క్రమంలో గురువారం (సెప్టెంబర్ 17న) సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో బుధుడితో సూర్యుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. అలాగే, సూర్యుడు శ‌నితో కలవడం వల్ల నవపంచమ రాజయోగం ఏర్ప‌డ‌నుంది.

P

Horoscope | Published On Sep 17, 2026, 6.32 am IST

Navpancham Rajyogam | నేడు నవపంచమ రాజయోగం.. ఈ రాశులకు ఆర్థిక లాభాలు, పెండింగ్ ప‌నుల‌కు మోక్షం..!
Advertisement

Navpancham Rajyogam | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం.. వాటి కలయికల ఆధారంగా వివిధ యోగాలు ఏర్ప‌డుతుంటాయి. ఈ క్రమంలో గురువారం (సెప్టెంబర్ 17న) సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో బుధుడితో సూర్యుడి కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. అలాగే, సూర్యుడు శ‌నితో కలవడం వల్ల నవపంచమ రాజయోగం ఏర్ప‌డ‌నుంది. ఈ యోగాన్ని శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ ప్రభావం అనుకూలంగా ఉండి, ఆర్థికంగా ప్రయోజనాలు, పనుల్లో పురోగతి కలిగే అవకాశాలున్నాయ‌ని పండితులు పేర్కొంటున్నారు.

కర్కాటక రాశి

నవపంచమ రాజయోగం కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశాలు గోచ‌రిస్తున్నాయి. ఈ సమయంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. చాలాకాలంగా పరిష్కారం కాని సమస్యలు క్రమంగా తొలగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా లాభపడేందుకు కొత్త అవకాశాలు ల‌భించే ఛాన్స్ ఉంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి తమకు నచ్చిన ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ ఉంది. అదనపు ఆదాయం కోసం అనేక మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన అవకాశాలు లభించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. సరైన నిర్ణయాలతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే వీలుంటుంది.

క‌న్యా రాశి

కన్యా రాశి వారికి నవపంచమ రాజయోగం శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. గతంలో చేసిన కష్టానికి తగిన ఫలితాలు అందే సమయం రావొచ్చు. ఈ కాలంలో గౌరవం, పేరు, ప్రతిష్ఠ పెరిగే అవకాశాలు ఉన్నాయి. చాలాకాలంగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం లభించవచ్చు. వ్యాపారంలో లాభదాయక అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేపట్టేవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉంది. దాంపత్య జీవితంలో ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. మొత్తంగా వృత్తి, వ్యాపారం, కుటుంబ వ్యవహారాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఐదో స్థానంలో ఏర్పడే నవపంచమ రాజయోగం అనుకూల ఫలితాలను అందించే అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం తదితర రంగాల్లో చాలాకాలంగా ఎదురవుతున్న ఆటంకాలు తొలగే అవకాశం ఉంటుంది. విద్యా రంగంలో ఉన్నవారికి ప్రయోజనకరమైన అవకాశాలు లభించవచ్చు. పెట్టుబడులు పెట్టే వారికి కూడా అనుకూల ఫలితాలు దక్కే ఛాన్స్ ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు, విజయాలు లభించే అవకాశం ఉంటుంది. ఈ కాలాన్ని విద్య, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత పురోగతికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.

Read Also :

Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్‌, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!

Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్‌ చేసుకోండి..!

Advertisement
Advertisement