త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ, సీఐ

ACB Raids | కీస‌ర పోలీసు స్టేష‌న్ సీఐ, ఎస్ఐ క‌లిసి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుంచి కీస‌ర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేంద‌ర్ రెడ్డి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు.

S

Hyderabad | Published On Sep 17, 2026, 8.46 am IST

ACB Raids | రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ, సీఐ
Advertisement

ACB Raids | త్రినేత్ర‌.న్యూస్ : కీస‌ర పోలీసు స్టేష‌న్ సీఐ, ఎస్ఐ క‌లిసి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుంచి కీస‌ర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేంద‌ర్ రెడ్డి రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు.

కీసర చెరువు వద్ద కారులో రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ప‌రుగులు పెట్టారు. మొత్తానికి ఎస్ఐ, సీఐని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ఎస్ఐ, సీఐ క‌లిసి ముప్పు తిప్పలు పెట్టారు.

రేషన్ బియ్యం కేసులో నిందితుల నుండి గత కొంతకాలంగా లంచం డిమాండ్ చేసి నిందితులతో ఆంజ‌నేయులు సొంత ప‌నులు చేయించుకున్న‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డైంది. గ‌త కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని సీఐ వేధింపులకు పాల్ప‌డ్డారు. వేధింపులు తట్టుకోలేక బాధితుడు ఏసీబీకి సమాచారం ఇచ్చాడు.

Advertisement
Advertisement